New Ration Cards Applications taking after 20: అర్హులను గుర్తించడంలో కలెక్టర్లు ప్రతి ఒక్కరూ గ్రామ సభకు అటెండ్ అవ్వాలని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.. జనవరి 26 నుంచి 4 పథకాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పినట్టుగానే 6 గ్యారంటీలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే పలు గ్యారెంటీలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఉన్న గ్యారెంటీ అయినా రైతు భరోసా మరియు కొత్త రేషన్ కార్డును ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల ద్వారా నిర్ణయాలను స్వీకరిస్తోంది.. వన్ స్టేట్ వన్ రేషన్ పేరుతో కొత్త రేషన్ కార్డులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు మాత్రమే ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈనెల 11వ తారీకు నుంచి 15వ తారీకు లోపల పథకాలకు కావలసిన ప్రిపరేషన్ వర్క్ అంతా అయిపోవాలని పదవ తారీకు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో పాటు ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అర్హులను గుర్తించడంలో కలెక్టర్లు ప్రతి ఒక్కరూ గ్రామ సభకు అటెండ్ అవ్వాలని అలా అటెండ్ అయిన తర్వాతనే అర్హులను గుర్తించాలని తెలిపారు కలెక్టర్లు తయారు చేసిన లిస్టును ఇన్చార్జి మంత్రి ఫైనల్ చేసిన తర్వాతనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది… ఇప్పుడు చేయబోయే మార్పుల ద్వారా రేషన్ కార్డులో ఎప్పుడైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అన్న లేదా కొత్త సభ్యులను ఆడ్ చేసుకోవాలి అన్న సులభంగా ఉండే విధంగా విధానాలను తయారు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు… ఈ 15వ తారీకు ముగిసిన తర్వాత 20 తారీకు నుంచి అమలు ప్రక్రియకు కావలసిన అన్ని పనులను మొదలుపెడతామని ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా వచ్చిన అభ్యర్థులను బేస్ చేసుకుని రేషన్ కార్డుకు అర్హులను గుర్తించే ప్రయత్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు…