National Mission an Natural Farming Scheme
కేంద్ర ప్రభుత్వం రైతులకు రసాయనాల ద్వారా అవుతున్న ఎక్కువ ఖర్చును తగ్గించడం కోసం ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
కేంద్రం తెచ్చిన ఈ పథకం పేరు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ఈ పథకం ద్వారా రైతులకు రసాయనాల ద్వారా అవుతున్న ఖర్చును తగ్గించి,వారికి మంచి ఆరోగ్యం అందించడమే కాకుండా సహజ వ్యవసాయ బెస్ట్ మెథడ్స్ ను డాక్యుమెంట్ చేయడానికి మరియు స్ప్రెడ్ చేయడానికి సంస్థాగత సామర్థ్యాలను సృష్టించడం, ప్రాక్టీస్ చేసే రైతులను ప్రోత్సాహక వ్యూహంలో భాగస్వాములుగా చేయడం, సామర్థ్య నిర్మాణం మరియు నిరంతర సహకారాన్ని నిర్ధారించడం మరియు చివరకు రైతులను సహజ వ్యవసాయం వైపు ఇష్టపూర్వకంగా ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకుండా ఈ పద్ధతులు వాడడం వలన దేశంలో అనారోగ్య సమస్యలు తగ్గి రైతులకు అధిక ఆదాయం అందించనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు రైతుల కోసం 7.50 లక్షల హెక్టార్ల భూమిలో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, 1 కోటి మంది రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుని రూ.2,481 కోట్ల ఈ పథకాన్ని నవంబర్ 25, 2024న ప్రారంభించబడింది. దీనిని ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ రూపొందించింది. ఈ మిషన్ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద నడుస్తుంది.
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు విరాళంగా ఇస్తుండగా, రాష్ట్రాలు రూ.897 కోట్లు విరాళంగా ఇస్తున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని రాబోయే రెండేళ్ల పాటు నిర్వహిస్తుంది.ఈ పథకం మొదటి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే 2 వ సంవత్సరం మాత్రం ఒకేసారి 616 కోట్ల రూపాయలను కేటాయించింది.
ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం చూసుకుంటే
వ్యవసాయ ఖర్చు, రైతుల రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ,జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రమాణాలు, ధృవీకరణ విధానం మరియు బ్రాండింగ్‌ను రూపొందించడం, సహజ వ్యవసాయ వ్యవస్థను ప్రోత్సహించడం, ఖర్చు తగ్గించడం మరియు తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం,దేశంలోని వివిధ ప్రాంతాలలో పాటిస్తున్న సహజ వ్యవసాయ పద్ధతులను సేకరించడం, ధృవీకరించడం మరియు డాక్యుమెంట్ చేయడం మరియు స్కేలింగ్‌ను మరింత పెంచడంపై రైతులతో భాగస్వామ్య పరిశోధనను ప్రోత్సహించడం ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశం,వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే రైతులు కుటుంబాలు, వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించగలిగేలా సహజ, స్థిరమైన వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్రోత్సహించడం,ఈ మిషన్ కింద ప్రభుత్వం 10,000 బయో ఇన్‌పుట్ వనరుల కేంద్రాలను ప్రారంభించనుంది,భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రసాయన రహిత సేద్యాన్ని ప్రోత్సహించడం, మట్టిలో ఉండే సూక్ష్మజీవుల ప్రాధాన్యాన్ని ఇందులో తెలియజేయనున్నారు.
పంట పొలంలో బయోఇన్‌పుట్‌ల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చును చాలా మేరకు తగ్గించడం, నేల కార్బన్ కంటెంట్, నీటి వినియోగ సామర్థ్యం, రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయానికి సాధారణ ధ్రువీకరణ, మార్కెట్ సౌకర్యం, జాతీయ బ్రాండ్ తదితర వసతులను కల్పించనున్నారు….సహజ వ్యవసాయం ఇప్పటికే ఆచరణలో ఉన్న ప్రదేశాలలో ఈ మిషన్ నిర్వహించనున్నారు. దీని కోసం గ్రామ పంచాయతీల మధ్య 15,000 క్లస్టర్‌లను విభజించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల రైతులు ప్రారంభంలో దీని నుండి ప్రయోజనం పొందుతారు..తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాల్లో పథకం అమలుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లాల వారీగా క్లస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారీగా రెండు నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో సుమారుగా 125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.
శిక్షణ
జిల్లాల వారీగా పరిశోధన సెంటర్స్ను కేంద్రంగా గుర్తించి అక్కడి సైంటిస్టులతో స్థానిక రైతులకు శిక్షణ ఇప్పించనున్నారు. రైతులకు సాయంగా ఉండేందుకు వారి నుంచి క్లస్టరుకు ఇద్దరు రైతులను సెలెక్ట్ చేస్తారు. వీరిని కృషి సఖీలు లేదా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని పిలుస్తారు. వీరికి నెలకు రూ.5 వేలు వేతనంగా ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనీ ఒకరు ఉంటారు. ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలిస్తున్న రైతులను ఎంపిక చేస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో తొలి ఏడాది దాదాపు 9,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టి విజయం సాధించారు.ప్రకృతి సేద్యం చేసే రైతులకు అవసరమైన బయో ఎరువులు, జీవ రసాయనాలు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఒక్కో క్లస్టరుకు మూడు చొప్పున బయో కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. ఒక్కొ కేంద్రానికి రూ.లక్ష ప్రభుత్వం అందించనుంది. వీటిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేలా తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ సాంకేతిక అధికారి విశ్వామిత్ర ఈటీవీ భారత్కు తెలిపారు. దీంతో రసాయనాల వాడకం తగ్గి భూసారం ఆరోగ్యకరమైన రితీలో ఉంటుంది. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
అర్హత…
ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి
ఈ పథకానికి అప్లికేషన్స్ ఆఫ్లైన్ ద్వారా తీసుకుంటారు.ఆసక్తిగల లబ్ధిదారుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పరిషత్ ఆఫీసు కి వెళ్ళి అప్లై చేసుకోవాలి.జిల్లా పరిషత్ అధికారి దరఖాస్తుదారుడి వివరాలను మరియు ప్రాజెక్ట్ ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయ శాఖకు సమర్పిస్తారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది.రాష్ట్రం నుండి నిధులు ఆమోదించబడిన తర్వాత, లబ్ధిదారునికి ఆర్థిక సహాయం విడుదల చేయబడుతుంది.
కావలసిన డాక్యుమెంట్స్
1. ఆధార్ నంబర్
2. భూమి పత్రాలు
3. కుల ధృవీకరణ పత్రం (SC/ST మాత్రమే)
4. బ్యాంక్ వివరాలు
5. పాస్ ఫోటోలు
ఈ పథకం వలన రైతుకు కలిగే ప్రయోజనాలు ఏంటి
- సహజ వ్యవసాయం ఎటువంటి సింథటిక్ రసాయనాలను ఉపయోగించదు కాబట్టి, ఆరోగ్య ప్రమాదాలు మరియు ప్రమాదాలు తొలగించబడతాయి. ఆహారంలో పోషక సాంద్రత ఎక్కువగా ఉంటుంది మరియు అందువల్ల మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
- సహజ వ్యవసాయం మెరుగైన నేల జీవశాస్త్రం, మెరుగైన వ్యవసాయ జీవవైవిధ్యం మరియు చాలా తక్కువ కార్బన్ మరియు నైట్రోజన్ పాదముద్రలతో నీటిని మరింత వివేకవంతంగా ఉపయోగించడాన్ని నిర్ధారిస్తుంది.
- ఖర్చు తగ్గింపు, తగ్గిన నష్టాలు, సారూప్య దిగుబడి, అంతర పంటల నుండి వచ్చే ఆదాయాల కారణంగా రైతుల నికర ఆదాయాలను పెంచడం ద్వారా వ్యవసాయాన్ని ఆచరణీయంగా మరియు ఆకాంక్షాత్మకంగా మార్చడం సహజ వ్యవసాయం లక్ష్యం.
- ఒకదానికొకటి సహాయపడే మరియు బాష్పీభవనం ద్వారా అనవసరమైన నీటి నష్టాన్ని నివారించడానికి నేలను కప్పే విభిన్న పంటలతో పనిచేయడం ద్వారా, సహజ వ్యవసాయం ‘ఒక్కొక్క చుక్కకు పంట’ మొత్తాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది.ఎంపిక చేసిన రైతులు ప్రకృతి సేద్యం చేసేందుకు వీలుగా ఎకరానికి రూ.4వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
ముగింపు
కేంద్రం తీసుకువచ్చినా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ వలన ఎలాంటి రసాయనాలు వాడకుండా నెల సారాన్ని కోల్పోకుండా పథ మరియు కొత్త పద్దతుల ద్వారా శాస్త్రీయంగా ధాన్యం మరియు ఇతర పంటలను పెంచడం దీని కోసం అని రైతులకు ప్రోత్సహకాలు కూడా అందిస్తుంది.(భీష్మ మూవీ రేంజ్ లో )
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here










