Nalgonda New Power Plant Opened 800 MV Units: నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో

Nalgonda New Power Plant Opened 800 MV Units: నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో

నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Power plant
Power plant

నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ (#YTPS)కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.

Cm Revanth Reddy
Cm Revanth Reddy

నల్గొండ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అలాగే నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థుల వైట్ కోట్ సెరమనీలో పాల్గొన్నారు. అక్కడ పలువురు విద్యార్థుల కాలేజీ అనుభవాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

New Power plant
New Power plant

కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంపీలు రఘువీర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Comment