నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం…కుల వివక్షతో 2 నెలల పసిపాప మరణం | Nagarkurnool Baby Girl Death Case 2026

Nagarkurnool Baby Girl Death Case

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఇటీవల జరిగిన పసిబిడ్డ మృతి ఘటన అత్యంత విషాదకరమైనది.కులవివక్ష చూపి 2 నెలల పసి గుడ్డు అని కూడా చూడకుండా కింద పడేసి తొక్కారని కుటుంబసభ్యులు ఆరోపిఇస్తున్నారు..

ఫిబ్రవరి 18న కుమ్మెర మల్లన్న జాతర అత్యంత వైభవంగా మొదలైంది.జాతర కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న స్వామిని దర్శించుకోవాలని,దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్లిన ఆ కుటుంబానికి ఊహించని శోకం మిగిలింది.

వివరాలు

కుమ్మెర మల్లన జాతర నెల 18 వైభవంగా ప్రారంభం కాగా అక్కడికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.దీంతో భక్తులను అదుపు చేస్తున్న క్రమంలో చంద్రకళ అనే మహిళకు మరియు ఆలయ నిర్వాహకుల మధ్య గొడవ తలెతింది.దేవుడిని దర్శనం చేసుకోవాలి అంటే 100 రూపాయలు చెల్లించాలి అని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అనడంతో చంద్రకళ కుటుంభం 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి..ఇక్కడ టోకెన్ ఏమైనా పెట్టారా అస్సలు ఎందుకు మీకు వంద రూపాయలు ఇవ్వాలి వారు అడగడంతో మహిళలు అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడి మీరు పాక్కకి జరగనుంది అని తోసి వేయడంతో వారు తిరిగి గుట్ట కిందకి వచ్చారు..

తరువా చంద్రకళ కొడుకు గణేష్ వాట్స్ ఆప్ గ్రూప్లో తమ తల్లికి అక్కకి మరియు భార్యకి జరిగిన అవమానాని పోస్ట్ చేయగా శ్రీనివాస్ రెడ్డి గ్రూప్ అతనిని మరియు అతని కుటుంబాన్ని గదిలో బంధించి ఏకధాటిగా 3 గంటలు కొట్టారని పసి పాపా మొఖం చూసి ఐన వారు ఊరుకుంటారేమో అని తల్లి పాపాను అతనికి చూపించగా కాలితో పాపను తన్నడం జరిగింది.దీంతో హుటాహుటిన నాగర్ కర్నూల్ జిల్లా లోని ప్రభుత్వ హాస్పత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 21న ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. సంఘటనపై న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లిన వారికి si మరియు ci నిందుతులపై కేసు ఫైల్ చేయకుండా బాధితులపై కేసు ఫైల్ చేయడంతో రాజకీయ వేడి రాచుకుంటుంది.

  • కుటుంబ సభ్యులు మరియు కుల సంఘాలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి.
  • ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కేసు నమోదు చేసింది.
  • పోలీసులు ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
  • బిడ్డ తల్లిదండ్రులకు మాజీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ ద్వారా పరామర్శించి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Leave a Comment