ఎత్తిన కుడి ,ఎడమ కాలువల నాగార్జున సాగర్ గేట్లు | Nagarjuna Sagar Crast Gates Opened 2025

Nagarjuna Sagar Crast Gates Opened

తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువల ద్వారా 51,226 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587 అడుగుల వద్ద నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు.

రైతు ప్రస్థానం: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో నిండుకుండలా దర్శనమిస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. దీంతో బుధవారం ప్రాజెక్ట్ అధికారులు తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువల ద్వారా 51,226 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587 అడుగుల వద్ద నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు.పవర్ హౌస్ కు 33,048 క్యూసెక్కులు,  స్పెల్ వే ద్వారా 64 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450టీఎంసీలుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.

Follow On:-

Leave a Comment