MPDO Attack case registered against 13 YRCP: 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా అహంకారం తగ్గించుకోకుండా
గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల గాలివీడులో ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నేత దాడి చేయడం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాగే దాడులు చేస్తూ పోతే ఊరుకునే ప్రభుత్వం తొమ్మిది కాదని ఇది వైసీపీ ప్రభుత్వం కాదని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన అన్నారు అహంకార ధోరణి ఇంకా మార్చుకోకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోక తప్పదని ఆయన తెలిపారు 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా అహంకారం తగ్గించుకోకుండా అలాగే ఉంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకో పోదని నిందితుల్ని వదిలిపెట్టకుండా ఉండమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పవన్ పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ఇది మీ ప్రభుత్వం కాదని మీరు ఇష్టానుసారం నడుచుకుంటూ ఉంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. మీ అహంకారం దించి మీకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అలాంటి చట్టాలపై మేము దృష్టి సారిస్తామని మీకు కచ్చితంగా శిక్ష పడేవిధంగా చేస్తామని అన్నారు మీకు 11 సీట్లు వచ్చినా కూడా గాల్లోకి ఎగసిపడుతున్నారని మిమ్మల్ని ఎలా కిందకు దింపాలో మాకు బాగా తెలుసు అని ఆయన ఫైర్ అయ్యారు. మీ ఇష్ట రాజ్యం చేయడానికి ఇది మీ ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం అందరం కలిసికట్టుగా త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు.ఈ ఒక్క నాయకులే కాదు ఏ ఒక్క నాయకులైన ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకున్న అసభ్యకరంగా మాట్లాడిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎవ్వరైనా ఆధిపత్య ధోరణి తోటి అధికారులపై దాడి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇప్పటికే ఎస్పీ గారికి అన్ని ఆదేశాలు ఇచ్చామని ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో వారిని కూడా అరెస్టు చేయాలని చెప్పమని అన్నారు వారికి కౌన్సిలింగ్ ఇయ్యాలని వారిపై ఎఫ్ఆర్ నమోదు చేయాలని అన్నారు
మధ్యలో పక్కనే ఉన్న కొంతమంది ఫ్యాన్స్ ఓ జి ఓ జి అని అరవడంతో వారిపై ఫైర్ అయ్యారు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏ నినాదం చేయాలో మీకు తెలియదని ఆయన ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా ఒక మీడియా మిత్రుడు అల్లు అర్జున్ కి బయటికి తీసుకురావాలి అని అడగ్గా ఒక మనిషి చనిపోయాడు మే దాంట్లో కలగచేసుకోను ఇది సినిమా కాదు మాట్లాడడానికి అని అన్నారు.