Morning Glory Plant Benefits For Farmer: లొట్టా పీసు చెట్ల ఉపయోగం రైతులకు ఎలాంటి మంచి చేస్తుందో
లొట్టా పీసు చెట్ల ఉపయోగం తెలియక చాలామంది వాటిని ఎక్కడైనా కానీ పిస్తే వాటిని పిచ్చి మొక్క అని పీకేస్తుంటారు కానీ అదే మొక్క రైతులకు ఎలాంటి మంచి చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కేసు ‘లొట్టపీసు’ కేసంటూ కేటీఆర్ పలుమార్లు వాడిని ఈ పదం పై చాలా మంది రీసెర్చ్ చేశారు.లొట్టపీసు అనేది ఓ చెట్టు పేరు. కాన్వాల్వ్ ఫ్యామిలీకి చెందిన ఈ లొట్టపీసు చెట్లను ఆంగ్లంలో మార్నింగ్ గ్లోరీ అంటారు. దీని సైంటిఫిక్ పేరు ఐపోమి యా కార్నియా. ఎక్కువగా ఈ మొక్కలు చెరువులు, కాలువలు, కుంటలు, నీరు ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి.
ఎన్నో ఔషద గుణాలు
పిచ్చి మెుక్కగా భావించే ఈ మెుక్కలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి.
- పల్లెల్లో ఈ కట్టెలతో ఇళ్లకు దడిగా,పశువుల కొట్టాలకు రక్షణ గోడగా కట్టుకునేవారు.
- మనుషులను కుట్టే దోమలను, పంటల దిగుబడిని దెబ్బతీసే దోమలను ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించొచ్చు.
- లొట్ట పీసు మొక్కలను కాగితం తయారీలోనూ వినియోగిస్తారు.
- లొట్ట పీసు మొక్కలో ఉండే పాలు తేలు విషానికి విరుగుడులా పనిచేస్తాయి.
- లొట్టపీసు చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి.. గో-మూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులా రైతులు ఉపయోగిస్తారు.
- ఇలా ఈ లొట్టపీసు చెట్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
- చర్మం మీద తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ పాలు రాస్తే తగ్గిపోతుంది.
- ఈ మొక్క కాండం తెల్లని పూతతో లొట్ట మాదిరి ఉండడం వల్ల దీనికి లొట్ట పీసు చెట్టు అనే పేరు వచ్చింది. వీటి కాండం విరిస్తే విరగకుండా రబ్బర్ మాదిరిగా సాగుతుంది. కాండాన్ని గిల్లితే పాలలాంటి ద్రవం వస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మెుక్కను రబ్బరు మొక్క, లొట్ట పీసు మొక్క, పాల సముద్రపు మొక్క అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు.
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?