Minister Nithin Gadkhari Good News New Scheme: వీరికోసం దేశంలో కొత్త పథకం
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది దీని ద్వారా డబ్బులు ఆదాయే అవకాశం ఉంది.
దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక మూల ప్రతి ఒక్క సెకండ్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమాదాలు జరగకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన మరియు జాగ్రత్తలు తీసుకున్న కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణంగా చాలామంది హాస్పిటల్స్ బిల్స్ కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయనున్నట కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘట్కరి తెలిపారు. ఈ రోజుల్లో ప్రమాదం జరిగినప్పుడు లక్షల్లో అయితే ఖర్చులు అవుతున్నాయి పేదవారు అవి భరించలేకుండా ఉన్నారు కాబట్టి వారి కోసం అని కొత్త పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే చికిత్స నిమిత్తం 1.5 లక్షలు బాధితుల ఖాతా జమ అవుతాయని తెలిపారు. అలాగే హిట్ అండ్ రన్ కేసులో కనుక బాధితులు మరణిస్తే వారికి రెండు లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వబడుతుందని తెలిపారు.
ఇప్పటికే ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుకు కింద తీసుకున్నామని ఆయన తెలిపారు ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు తీసుకొస్తామని తెలిపారు. ఈ పథకం పేరు నగదు రహిత చికిత్స పథకం….ప్రమాదాలు జరిగి హాస్పిటల్ లో బిల్లులు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి ఈ పథకం ఒక ఊరట అనే చెప్పవచ్చు.ఈ పథకం ఏప్రిల్ 2025 నుండి వర్తిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే అస్సాం, పంజాబ్, హర్యానా మరియు పుదుచ్చేరిలో ఈ పథకం కోసం పైలట్ ప్రోగ్రాము అమలు చేసింది.నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థ మొదలైన వాటితో సమన్వయంతో ప్రోగ్రామ్ కోసం ఒక ఏజెన్సీని నియమించే అవకాశం ఉంది.