25న జరగబోయే భారీ జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి | Mega Job Mela in Huzurnagar on 25th october

Mega Job Mela in Huzurnagar on 25th october:-తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కఠినంగా కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.ఇప్పటికే రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది రేవంత్ సర్కార్.

రైతు ప్రస్థానం:గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కోసం ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో నిర్వహించే మెగా జాబ్‌మేళాకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గ్రామ పాలనాధికారులు, గ్రామ పోలీసు అధికారులు సూచించారు. సమాజంలో అతిపెద్ద సమస్యగా మారిన నిరుద్యోగ సమస్యను తమవంతుగా కొంతవరకైనా తీర్చాలన్న ఉద్దేశంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం హుజూర్‌నగర్‌లో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుం డి ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎంపిడిఒలు, గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పోలీసు అధికారులతో జాబ్‌మేళాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నప్పటికీ ఉద్యోగావకాశాలు సరిగా లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు సరి గా రావడం లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కఠినంగా కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.ఇప్పటికే రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది రేవంత్ సర్కార్.

అయినంత ఎక్కువ మొత్తంలో నిరుద్యోగ సమస్యలు తలెత్తుతుండడంతో పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజిక వర్గం ఐన హుజూర్నగర్లో ఈ నెల 25న భారీ జాబ్ మేళ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటి భారీ జాబ్మేళా ఏర్పాట్లను ఆయన మంగళవారం పర్య వేక్షించారు. ఇప్పటికే 205 కంపెనీలు 9,500 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అభ్యర్థులకు భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వాన్ని అర్ధం చేసుకొని అభ్యర్థులు మెలగాలని ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగామ్ రావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు. జాబ్ మేళ ద్వారా ప్రభుత్వం ముందడుగు వేయనుంది అని అన్నారు.


Follow On:-

Leave a Comment