mallu ravi nagarkurnool mp victims vs accused controversy
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి గారు బాధితుల పక్షమా…నిందితుల పక్షమా స్పష్టం చేయాలి. కుమ్మెర సంఘటనపై సీఎం మరియు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి. నిందితులను అరెస్ట్ చేసే వరకూ దశలవారి ఉద్యమాలు – కుమ్మెర బాధితుల న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస).
ఇ రోజు కుమ్మెర బాధితుల న్యాయ పోరాట ఐక్యకార్యాచరణ కమిటీ (ఐకాస)ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇ కార్యక్రమంలో ఐకాస కన్వీనర్ బోనాసి రాంచందర్ అడ్వకేట్, కో-కన్వీనర్లు పర్వతాలు, కోళ్ళ శివ, ఆర్.శ్రీను, ఎదిరేపల్లి కాశన్న, శివశంకర్ యాదవ్, అంతటి కాశన్న, నిజాం, పొదిల రామయ్య, నాగపూరి మధు, నవీన్, అశోక్, కళ్యాణ్, పృథ్వీరాజు, వెంకటయ్య, రామకృష్ణ, తారాసింగ్ తదితరులు మాట్లాడారు. ఇ రౌండ్ టేబుల్ మీటింగ్ లో వక్తలు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతల నిన్నటి కుమ్మెర గ్రామ పర్యటన నిజాలను సమాధి చేసే విధంగా ఉందని విమర్శించారు.
తక్షణమే కుమ్మెర గ్రామ సమస్యపై రాష్ట్ర సీఎం మరియు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని బాధితులకు బాసటగా నిలిచి, నిందితులను అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ మొదట బాధితులను కలవాలని అన్నారు. ఆ తర్వాత సంఘటన స్థలాన్ని, ఆ తదుపరి సంబంధిత అధికారులను, చివరగా మళ్ళీ బాధితులను కలవాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ బృందం, కుమ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటి ముందర మీటింగ్ నిర్వహించి, బాధితులకు ఏం సందేశం ఇస్తుందని గర్హించారు. రిజర్వేషన్ స్థానాల్లో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు దళిత బహుజనులకు అండగా ఉంటారని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారు కలలు కంటే, దానికి విరుద్ధంగా రాష్ట్రములోని దళిత, బహుజన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూన్నారని మాట్లాడారు.
బాధితులకు న్యాయం చేయమని అడుగుతుంటే, బాధితురాలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఏంటని మండిపడ్డారు. బాధితురాలు ఒకవేళ పిచ్చకుంట్ల కులానికే చెందింది ఐతే కొట్టవచ్చా అనీ దుయ్యబట్టారు. బాధితురాలికి ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది నిందితుల అరెస్ట్ విషయాన్నీ పక్కదారి పట్టించడానికే అనీ ఆరోపించారు. బాధితురాలికి ఎన్ని పెళ్లిళ్లు ఐనా, ఎంతమంది పిల్లలు ఉన్న, ఏ కులం ఐనా గుడిలో గొడవ జరిగింది వాస్తవం. మహిళలను కించపరిచింది వాస్తవం. ఆ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఎక్కడో ఉన్న సంఘాయిపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అనీ పిలిచి కుమ్మెర గ్రామంలో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడించారని, ఇంత శ్రద్ధ నిందితుల అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించ్చారు.
నిన్నటి కుమ్మెర మీటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీయే పూర్తిగా నిందితులకు మద్దత్తు పలుకుతున్నట్లు అనిపించిందని ఆరోపించారు. కుమ్మెర సంఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ తన మొండివైఖరి విడనాడి, నిందితుల అరెస్ట్ కు పూర్తిగా పోలీస్ అధికారులకు స్వేచ్ఛనిచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో నాగర్ కర్నూల్ కేంద్రంగా బాధితులకు న్యాయం కోసం రిలే దీక్షలు, శాంతి ర్యాలీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి, చివరగా న్యాయం కోసం బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సంఘాల పోరాటంలో మాజీ ఎమ్మెల్యే గారి పాత్ర లేదని, అనవసరంగా సమస్యను పక్కదారి పట్టించి బాధితులకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ ఐకాస తరపున పోరాటలు ఉంటాయని అన్నారు. ఇ కార్యక్రమంలో ఐకాస నాయకులు భాస్కర్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Follow Links
- Join Whats App Channel: Click Here
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here










