Mahatma Gandhi Upaadi Hami Scheme Name Change
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మహాత్మా గాంధీ పేరును మార్చే విధంగా ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టింది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును రీప్లేస్ చేయనుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.. దీని స్థానంలో గ్రామీణులకు ఉపాధి కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లు (New Rural Employment Law) ప్రతులను సోమవారం లోక్సభ సభ్యులకు అందించారు.
ప్రస్తుతం ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు.ఎన్ఆర్ఆజీఏ‘ చట్టాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసి కొత్తగా.. వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (5) (VB-G RAM G) , 2025 తీసుకురానున్నట్లు సమాచారం. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిని సాధించే దిశగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు బిల్లులో పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కొత్త పేరును పెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.అంతేకాకుండా ఇప్పటివరకు ఈ పథకంలో 100 రోజుల పని దినాలు ఉండగా.. వాటిని సంవత్సరానికి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.పథకానికి రూ.1.51 లక్షల కోట్లను కేటాయిస్తూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఒక రోజుకు కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.










