ఎన్‌డీఎస్ఏకు సంచలన లేఖ రాసిన ఎల్&టీ సంస్థ : L&T company writes sensational letter to NDSA

L&T company writes sensational letter to NDSA

మేడిగడ్డ నివేదికను తిరస్కరిస్తున్నామని, పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ ఎన్‌డీఎస్ఏకు లేఖ రాసిన ఎల్&టీ సంస్థ

ఎన్‌డీఎస్ఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం మేడిగడ్డ వైఫల్యం తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు చేయాలని, పరీక్షలు చేయకుండా బ్యారేజ్ పరిస్థితిని తెలుసుకోలేమని పేర్కొంది.కానీ గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని నివేదికలో పలు చోట్ల పేర్కొంది, పరీక్షలు చేయనప్పుడు నివేదిక ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించిన ఎల్&టీ సంస్థ.నివేదికలోని పేజీ–283లో క్వాలిటీ కంట్రోల్ విషయానికి సంబంధించిన నివేదికను ఎల్&టీ సమర్పించిందని పేర్కొంటూనే పలు చోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా ప్రస్తావించారని ఎన్‌డీఎస్ఏను ప్రశ్నించిన ఎల్&టీ.బ్యారేజ్ పునరుద్ధరణ గురించి ఇదివరకే ఒకసారి ఎన్‌డీఎస్ఏకు, నీటిపారాదుల శాఖకు లేఖ రాశామని, పరీక్షలు చేయకుండా బ్యారేజీలో వైప్ల్యలం ఉందని నివేదిక తయారు చేయడం సరికాదని లేఖలో పేర్కొన్న ఎల్&టీ సంస్థ.

కాగా  కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ, అధిక నీటి వేగం, తగినంత శక్తి దుర్వినియోగం మరియు సంభావ్య డిజైన్ లోపాలు వంటి అంశాల కలయిక కారణంగా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా, బ్లాక్ 7 పగిలిపోయిన మరియు స్థానభ్రంశం చెందిన పియర్లు మరియు తెప్పలతో కోలుకోలేని నష్టాన్ని చవిచూసింది, ఇది గేట్ కార్యకలాపాలకు నిరుపయోగంగా మారింది. ఈ సమస్యల కారణంగా మూడు బ్యారేజీలకు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళిక అవసరాన్ని జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ (NDSA) కూడా నొక్కి చెప్పింది.   

Leave a Comment