స్థానిక ఎన్నికలకు విడుదలైన నోటిఫికేషన్ 144 సెక్షన్ అమలు | Local Body elections Notification Released

Local Body elections Notification Released

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. MPTC, జడ్పీటీసీ తొలి దశ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి విడతలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రోజూ ఉ. 10.30 నుంచి సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది.

ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 13న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.OCT 9-11 వరకు ప్రతిరోజు ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.సూర్యాపేట జిల్లాలోని 11 మండలాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు SP నరసింహ తెలిపారు. గురువారం నుంచి జరగనున్న MPTC, ZPTC స్థానాల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

నామినేషన్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల పర్యవేక్షణ ఉంటుందని, శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై నేడూ హైకోర్టులో విచారణ జరగనుంది. 2.15PM నుంచి వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. నిన్న 4.30 గంటల పాటు కోర్టు.. ప్రభుత్వ, పిటిషనర్ల వాదనలు విని కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో నేటి నుంచి MPTC, ZPTCల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Leave a Comment