ఆరు గ్యారెంటీలు,420 హామీల మాదిరిగానే 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా | Laxmikantha reddy Comments on Cm Revanth Reddy 2025

Laxmikantha reddy Comments on Cm Revanth Reddy

ఆరు గ్యారెంటీలు,420 హామీల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

దుందుడుకు నిర్ణయాలతో ఆగమేఘాలమీద స్థానిక సంస్థల షెడ్యూల్ ని విడుదల చేసి, అత్యున్నత న్యాయ స్తానం చేత మొట్టికాయలు తిని, తెలంగాణ ప్రజల మనోభావాలను మంట గలిపిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు డిమాండ్ చేసారు.

55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా అని ఈ సందర్భంగా బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి ప్రశ్నించారు.మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి.22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గారు,గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదు.

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని కోరాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు.బీసీల పట్ల తమకు నిజంగానే అపారమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి స్థానంలో ఒక BC బిడ్డని కూర్చో బెట్టండి, 8 మంది BC ఎమ్యెల్యేలని మంత్రి స్థానంలో కూర్చోబెట్టండి అంతేగాని, BC ల పైన ప్రేమ ఉన్నట్లు నటిస్తూ తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసి,స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో చావు దెబ్బ తిన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో మాట్లాడండి. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చండి.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి. ఢిల్లీ వేదికగా రాజ్యాంగబద్దంగా యుద్ద భేరి మోగించండి. ఉద్యమ పార్టీగా బిజెపిఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది.

Leave a Comment