Kubera Movie Review in Telugu 2025
శేఖర్ కమ్ముల సినిమా అంటే సహజత, భావోద్వేగ పరిపక్వత. అయితే “కుబేర”లో ఆయన ఓ కొత్త ప్రయోగానికి పూనుకున్నారు. భావోద్వేగాల తెరచాటున సమాజంలోని తీపి చేదు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారు. నేటి సమాజంలో డబ్బు ఎంతటి ప్రభావం చూపుతోందో… కేవలం జీవించడానికే కాదు, మన విలువలు పునర్నిర్మించడానికీ ధనం ఎలా ఒక ఆయుధంగా మారిందో ఆవిష్కరించారు.
శేఖర్ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చినా.. శేఖర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్‌గా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్ రీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది.
ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఒకవిధంగా దేశంలోని అత్యంత ధనవంతులు ఆ స్థాయికి ఎలా ఎదుగుతారో కళ్లకు కట్టినట్లు చూపించారు శేఖర్. బినామీ వ్యవస్థ దేశంలో ఎంతగా పెచ్చరిల్లుతోందో, దాని ద్వారా వైట్ కాలర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో మొదటిసారిగా తెలిసేలా చేసారు. మూడు ప్రధాన పాత్రలూ సంఘర్షణాపూరితంగా ఉండటం ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేస్తుంది. శేఖర్ కమ్ముల ఒకరకంగా తన కంఫర్ట్ జోన్నుండి బయటకొచ్చి, ఇద్దరు స్టార్ హీరోలతో ఇటువంటి కథాచిత్రం తీయగలగడం సాహసమేనని చెప్పాలి.
దీపక్ (నాగార్జున) నిజాయితీగల ఒక సీబీఐ అధికారి. అయితే, తన నిజాయితీ కారణంగా కొంతమంది వ్యక్తులు పెట్టిన తప్పుడు కేసులతో జైలులో ఉంటాడు. తాను నమ్ముకున్న న్యాయం దీపక్ కు జరగదు. మరోవైపు నీరజ్ మిత్ర (జిమ్ సర్భ్) ఒక పెద్ద పారిశ్రామికవేత్త. దేశానికి 15 ఏళ్ల పాటు సరిపడే చమురు నిల్వలు దొర్కుతాయి. మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుని, ఆ చమురు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ కి ఒక్క దీపక్ మాత్రమే కరెక్ట్ అని జైలు నుంచి దీపక్ ను బయటకు తెస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు బినామీ ఖాతాలలో రూ.1 లక్ష కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ నలుగురు బెగ్గర్స్ లో దేవ (ధనుష్) ఒకడు. మరి దీపక్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా ?, ఇంతకీ, దేవ పాత్ర ఏమిటి ?, గతంలో దేవాకి – దీపక్ కు మధ్య సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.
బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన సినిమాకు హైలైట్ అని, ఈ చిత్రం విడుదలయ్యాక ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారని సెన్సార్ వర్గాలు చెబుతున్నాయి. శేఖర్ కమ్ముల ధనుష్ పాత్రను తీర్చిదిద్దిన తీరు మెస్మరైజ్ చేస్తుందట. కింగ్ నాగార్జున ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని, ధనుష్‌తో పోటాపోటీగా నటించారని టాక్.రష్మిక కెరీర్ లో గుర్తుంచుకునే పాత్రను ‘కుబేర’లో చేసిందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని, టీజర్, ట్రైలర్ లోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుందని అంటున్నారు.నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు అందుకుంటున్నాయి.