KTR Fire On Revanth Reddy in Chevella Deeksha: చేవెళ్ల ఉప ఎన్నిక కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.
చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చేవెళ్లకు త్వరలో ఉప ఎన్నిక రాబోతోందని KTR వ్యాఖ్యలు ఎలాంటి పెను మార్పు సూచించబోతున్నాయో …నిన్న ఈడీ వొచ్చారణకు హాజరైన ఆయన ఈ రోజు చేవెళ్లలో రైతుల పక్షాన మీటింగ్ నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో BRS ఆధ్వర్యంలో ‘రైతు దీక్ష’ చేపట్టారు. ఇందులో పాల్గొన్న కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.ఒక్క గ్రామంలో అయినా వందశాతం రైతు రుణమాఫీ అయిందని నిరూపిస్తే BRS ఎమ్మెల్యే లందరం రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతులు, మహిళలు సహా అందరినీ రేవంత్ మోసం చేశారని.. ఆరు గ్యారంటీలు అని అర గ్యారంటీ మాత్రమే అమలు చేశారని విమర్శించారు…రాష్ట్ర ప్రజల నోట్లో మన్ను కొట్టారు అని అన్నారు…మల్ల ఇప్పుడు రైతు భరోసా ఈ భరోసా లో కూడా కోతలు విధిస్తున్నాం అని అన్నారు అది కూడా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇష్టం అని అన్నారు.
చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు కేసీఆర్‌కు ఓటేయడంతో ఇక్కడి ఎమ్మెల్యే గెలిచాడని, కానీ ఇప్పుడా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చంకలో దూరాడని మండిపడ్డారు. నియోజకర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరానని కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. మరి ఏడాది పాలనలో ఆరు గ్యారెంటీలు అమలయ్యాయా? రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా అమలయ్యాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.రేవంత్ రెడ్డి నోట అన్నీ అబద్ధాలే వస్తున్నాయని, మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.