KTR fire on Cm Revanth Reddy About Water
రైతు ప్రస్థానం: కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యంతో 480 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారని, పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తాడని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలిందని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ అన్నారు.కేసీఆర్పై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండిపోయాయని అన్నారు.
రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిపోయిన పొలాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు.మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన మీడియా పాయింట్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక సచివాలయం ఆవరణలోని కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మూటగట్టి గాంధీభవన్కు పంపిస్తామని స్పష్టం చేశారు. వాటిని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవాలని సూచించారు.