Khazipet Railway Coach Factory Revanth Reddy: కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ 2024

Photo of author

By Admin

Khazipet Railway Coach Factory Revanth Reddy: కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ 2024

కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Railway Couch Factory
Railway Couch Factory

కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు.

రాష్ట్ర ఎంపీలతో కలిసి సీఎంగారు అశ్వనీ వైష్ణవ్ గారిని కలిశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటును పేర్కొన్న విష‌యాన్ని ప్రస్తావించారు. కాజీపేట‌లో పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ (పీవోహెచ్‌) వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు రైల్వే శాఖ ప్ర‌క‌టించింద‌ని గుర్తుచేస్తూ ఆ త‌ర్వాత సైతం కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశాన‌ని చెప్పారు.అలాగే, వికారాబాద్‌ – కృష్ణా స్టేష‌న్ మ‌ధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్య‌యంతో నూత‌న రైలు మార్గం నిర్మించాల‌ని, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య రావాణాకు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. ఆ మార్గం నిర్మిస్తే ద‌క్షిణ తెలంగాణ‌లో మారుమూల‌ వెనుక‌బ‌డిన ప‌రిగి, కొడంగ‌ల్‌ తదితర ప్రాంతాలన్నీ సిమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు అభివృద్దికి అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు.

క‌ల్వ‌కుర్తి-మాచ‌ర్ల మ‌ధ్య నూత‌న రైలు మార్గం మంజూరు చేయాల‌ని సీఎం కోరారు. క‌ల్వ‌కుర్తి నుంచి వంగూరు-కందుకూరు-దేవ‌ర‌కొండ‌-చ‌ల‌కుర్తి-తిరుమ‌ల‌గిరి మీదుగా మాచ‌ర్ల వ‌ర‌కు తాము ప్ర‌తిపాదించే నూతన మార్గం ప్ర‌తిపాదిత గ‌ద్వాల‌-డోర్న‌క‌ల్‌, ఇప్ప‌టికే ఉన్న మాచ‌ర్ల మార్గాల‌ను అనుసంధానిస్తుంద‌ని సీఎం వివ‌రించారు.డోర్న‌క‌ల్‌-మిర్యాల‌గూడ (పాప‌ట‌ప‌ల్లి-జాన్ ప‌హాడ్‌), డోర్న‌క‌ల్‌-గ‌ద్వాల ప్ర‌తిపాదిత రైలు మార్గాల‌ను పునఃప‌రిశీలించాల‌ని సీఎంగారు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండు మార్గాల అలైన్‌మెంట్‌ను పునఃప‌రిశీలించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, మల్లు రవి గారు, సురేష్ శేట్కర్ గారు, పొరిక బలరాం నాయక్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గడ్డం వంశీ గారు, కడియం కావ్య గారు, రామసహాయం రఘురామిరెడ్డి గారు, కుందూరు రఘువీర్ గారు, ప్రభుత్వ సలహదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, మాజీ ఎంపీ న్మంతరావు గారు ఉన్నారు.

Leave a Comment