Indian Railways Longest Route travelled train
రైలు ప్రయాణం అంటే అందరికి అహల్లాదకరంగా ఉంటుంది. కొంత మంది ఐతే ట్రావెలింగ్ అంటే పది చచ్చి పోతుంటారు.ఎలాంటి ఎక్కడికైనా ఓకే నాలుగు రోజులు ప్రయాణం చేయాలని ఉంటుంధీ అలంటి వారికోసం ఇప్పుడు ఒక రైలు ప్రయాణం.
భారత దేశంలో అతి పెద్ద ప్రయాణ మార్గం రైలు ప్రయాణం ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పడమర వరకు నడుస్తుంది. భారతీయ రైల్వే ట్రాక్‌లు పర్వతాల నుండి అడవుల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి మార్గం భారతదేశపు పొడవైన రైలు ప్రయాణం. మీరు ఈ ప్రయాణాన్ని ఒకసారి ప్రారంభిస్తే 4 రోజుల్లో మీ గమ్యాన్ని చేరుకుంటారు.మనం ఎప్పటికప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అంటే 1 లేదా 2 రోజుల్లో రైలు ప్రయాణం చేసి వస్తు ఉంటాం కానీ ఈ రైలులో ప్రయాణం చేయాలి అంటే ఒకే కోచ్ లో మనం 4 రోజులు ప్రయాణం చేస్తే ఆ త్రిల్ వేరే కదా.. ఆ త్రిల్ ఎక్కడ మొదలై ఎక్కడి వరకు వెళుతుందో తెలుసుకుందాం..
ఈ రైలు 19 కోచ్ లతో 9 రాష్ట్రాల మీదుగా 4 రోజుల పాటు ప్రయాణం చేస్తుంది.అస్సాంలోని దిబ్రుగర్ నుండి మొదలై తమిళనాడులోని కన్యాకుమారి లో ముగుస్తుంది.దాదాపుగా 4189 కి.మీ ఉన్న దూరాన్ని ఛేదించాడానికి 75 గంటల samayanni తీసుకునే రైలు వివేక్ ఎక్ష్ప్రెస్స్ దేశాల్లో అత్యంత పొడవైన గమ్యాన్ని ఛేదించే ఈ రైలు వారంలో రెండు రోజులు మాత్రమే నడుస్తుంది.
దిబ్రూఘర్ – కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ 2011-12 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించారు. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు నడుస్తుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ 9 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.దేశంలోని ఈ సుదూర రైలు అస్సాం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మధ్య నడుస్తుంది. ఈ పర్యటనను పూర్తి చేయడానికి 4 రోజులు పడుతుంది.IRCTC వెబ్సైట్ రైలు నంబర్ 15905/15906 ప్రకారం వివేక్ ఎక్స్‌ప్రెస్ మంగళ, శనివారాల్లో నడుస్తుంది. ఈ రైలు డిబ్రూఘర్ నుండి రాత్రి 7.25 గంటలకు బయలుదేరి 75 గంటల పాటు ట్రాక్‌పై నడుస్తుంది. నాల్గవ రోజు రాత్రి 22.00 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది.