గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అధ్యక్షతన నిరహార దీక్ష | Hunger strike led by Tribal Students 2025

Hunger strike led by Tribal Students

గిరిజన విద్యార్థి సంఘం(GVS) రాష్ట్ర అధ్యక్షులు వడ్త్యావత్ రమేష్ నాయక్ అధ్యక్షతన నిరహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి,మాజీ శాసన సభ్యులు డా.సి. లక్ష్మా రెడ్డి గారు విచ్చేసి,నిరాహార దీక్ష విరమణ చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు,GVS నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని, లంబాడీలను ST జాబితా నుండి తొలగించే కుట్రలకు ఎవరు సహకరించబోరని ఇది అన్యాయమని లంబాడీలు రాజ్యాంగ బద్దంగానే ST జాబితాలో కొనసాగుతున్నారని అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు,గత BRS ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని,గిరిజన రిజర్వేషన్లను 6% నుండి 10 శాతానికి పెంచమని తెలిపారు.గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్త్యావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ

గిరిజన తెగల మధ్య చిచ్చురేపుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడలను తొలగించాలని,మోసపూరిత, కుట్రపన్నుతున్న దుర్మార్గులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం బాబురావుEx MP గారు, తెల్ల వెంకటరావు MLA గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ,సోయం బాబురావు,తెల్లం వెంకట్రావు లను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, లంబాడీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నాయకులను, పార్టీలను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ,లంబాడీలపై జరుగుతున్న కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్డుకోవాలని,గిరిజన తెగల మధ్య చిచ్చురేపుతున్న వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

అదేవిధంగా ఈ నెల 22వ తేదీన ఇదే అంశంపై హైదరాబాద్ యందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు. నిరసన ధర్నా మరియు వినతిపత్రం సమర్పణ కార్యక్రమం నిర్వహించబడును కావున యావత్తు బంజారా నాయకులు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,మహిళలు,యువకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునివ్వడం జరిగింది.జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంగోత్ లోకేష్ నాయక్ మాట్లాడుతూ లంబాడీల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం జరిగింది.GVS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగానే లంబాడీలు ST జాబితాలో కొనసాగుతున్నారని అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.GVS రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంగోత్ లక్ష్మణ్ పవార్ మాట్లాడుతూ లంబాడీలంత ఐక్యమై జాతి ద్రోహులను గుర్తించి తరిమి కొట్టాలని,లంబాడి జాతికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించడం జరిగింది.

ఈకార్యక్రమానికి మద్దతుగా మాజీ zp వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య,కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి,BRS నాయకులు నాగిరెడ్డి,నాగులు,క్రిష్ణ రెడ్డి,ఇమ్ము, శ్రీకాంత్,కరాటే శ్రీను,రఘు పతి రెడ్డి,ఫకీర్ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జహంగీర్ పాషా,SFI జిల్లా కార్యదర్శి భరత్,GVS నాయకులు సంతోష్ నాయక్,GVS నారాయణ పేట జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్,గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాము నాయక్,గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు D.లక్ష్మణ్ నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ నాయక్,దాడి లంబాడి సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షెరావత్ రాజేష్ నాయక్,DLHPS జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్,జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ పవార్, జిల్లా కార్యదర్శి రుదావత్ రమేష్ నాయక్,గోర్ సీక్వాడి నాయకులు తిరుపతి నాయక్,LHPS నాయకులు గాంగ్య నాయక్,గోపాల్ నాయక్,మాజీ ఎంపీపీ లక్ష్మి శంకర్ నాయక్,మాజీ సర్పంచ్ రవి నాయక్,తారాసింగ్,శంకర్ నాయక్, ప్రేమ్ చాంద్,కిషన్ నాయక్, అఖిల,పూజ,సరోజ,మౌనిక,సరిత,సింధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment