How to Link With Ration Card with Aadhar Card
రాష్ట్రంలో ఉన్న బోగస్ రేషన్ కార్డులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏరివేస్తుంది ఇంకా ఉన్న బోగస్ కార్డులను తీసివేసి అస్సలైన అర్హులకు మాత్రమే రేషన్ ను అందించడం కోసం కొత్తగా ఆధార్ లింకులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలో ఉన్న బోగస్ రేషన్ కార్డులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏరివేస్తుంది ఇంకా ఉన్న బోగస్ కార్డులను తీసివేసి అస్సలైన అర్హులకు మాత్రమే రేషన్ ను అందించడం కోసం కొత్తగా ఆధార్ లింకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా తమ రేషన్ కార్డులను ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే చేసుకోవాలని లేకపోతె వారికి ఇంకెప్పుడు రేషన్ కార్డు రాదు ఉన్న రేషన్ కార్డు కూడా రద్దు అవుతుంధీ అని గోవెర్నెమ్నెట్ తెలిపింది.మీరు ఇప్పుడు లైన్లో క్యూలలో నిలబడటం గురించి ఆలోచిస్తున్నారా? ఆ బాధ కూడా మీకు లేదు. మీరు ఈ ముఖ్యమైన పనిని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. ఆధార్, రేషన్ కార్డులను అనుసంధానించే ప్రక్రియ చాలా సులభం ఆహార శాఖ అధికారులు చెబుతున్నారు. అది ఎలానో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం…
రేషన్ కార్డును ముఖ్యంగా రెండు విధాలుగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు.అందులో 1.ఆన్లైన్ ద్వారా 2.ఆఫ్లిన్ ద్వారా
1.ఆన్లైన్
ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డును లింక్ చేసుకోవాలి అని అనుకుంటే
- మీ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- అక్కడ, “రేషన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయండి” అనే ఛాయిస్స్ కనిపిస్తుంది.
- మీ రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అక్కడ ఇవ్వండి.
- మీ మొబైల్‌కు వచ్చిన OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని నమోదు చేయండి.
2.ఆఫ్లిన్
- ఆన్‌లైన్‌లో చేయడం సౌకర్యంగా లేని వారు సమీపంలోని ఫుడ్ ఆఫీస్ లేదా రేషన్ షాపుకు వెళ్లి వారి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్ కాపీని సమర్పించి లింక్ చేసుకోవచ్చు.
- అసలు ఇది ఎందుకు చేయాలని చాలా మంది ఆలోచిస్తున్నారు! నిజమైన లబ్ధిదారులు రేషన్ పొందేందుకు, నకిలీ రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని ఆపడానికి ఈ లింకింగ్ తప్పనిసరి చేశారని ఆహార శాఖ తెలిపింది.
ప్రభుత్వం తెలిపిన గడువు సమయంలో లింక్ చేయకపోతే, మీ రేషన్ ప్రయోజనాలు రద్దు చేయబడవచ్చు. కాబట్టి, ఆలస్యం చేయకుండా, మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా సమీపంలోని ఫుడ్ ఆఫీస్‌కు వెళ్లి మీ ఆధార్, రేషన్ కార్డును ఇప్పుడే లింక్ చేయండి.
FAQ