How to Apply PM Viksit Bharat Rojgar Yojana 2025
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.గుడ్ న్యూస్ చెప్పడమే కాదు అమలు కూడా చేసింది. ఆగస్టు 15th నా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జెండా వందనం చేసిన తరువాత నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడం కోసం శత విధాల కస్టపడి ఒక మంచి scheme పట్టుకోచాం అని ఈ scheme ద్వారా ప్రతి నిరుద్యోగి ఉద్యోగిగా మారతాడు అని అన్నారు.. ఈ స్కీం నిరుద్యోగులకు నచ్చుతుంది అని కూడా అన్నారు.
Pm లంచ్ చేసిన ఈ పథకం కిందా ప్రతి ఒక్క ఉద్యోగి 15 వేల రూపాయలు పొందవచ్చు.అలాగే ఉద్యోగం ఇచ్చిన కంపెనీ కూడా ఈ పథకం కిందా లబ్ది పొందవచ్చు.pm గారు కొత్తగా లంచ్ చేసిన పథకం పేరు వికసిత్ భారత రోజగర్ యోజన ఈ పథకం ప్రయోజనం ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి, మనలని ఉద్యోగంలో చేర్చుకోవడం వలన కంపెనీకి ఎలా లాభం..మనం ఎలా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం…

దేశంలో ఇప్పుడు ఎక్కువగా ఉంది నిరుద్యోగం ఉద్యోగాలు లేక డిగ్రీలు pg లు చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇంటర్వ్యూ కి వెళితే ఎన్నో రకాల questions ఆన్సర్ చేసిన కొంతమందికి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు గానే మిగిలి పోతున్నారు. అయితే వీరిని దృష్టిలో ఉంచుకొని రీసెంట్గా ప్రధాని మోదీ గారు ఇప్పటికే ఉన్న వికసిత్ భారత్ పథకాన్ని బేస్ చేసుకొని నిరుద్యోగులకు మరో పథకాన్ని అమలు చేస్తోంది.అదే వికసిత్ భారత్ రోజగర్ యోజన.ఈ పథకాన్ని కేంద్ర క్యాబినేట్ జూలై 30న ఆమోదం తెలిపింది.
ఐతే ఈ పథకాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నిరుద్యోగులకు తెలియజేశారు.ఈ పథకం అమలు చేయడం కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ,epfo సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.ఈ పథకం కోసం 99 వేల 446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్రం..ఈ పథకం యొక్క tenure 2 సంవత్సరాలు 2027 జూలై 31 వరకు ఈ పథకం కింద నిరుద్యోగులు లబ్ధి పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.ఈ పథకం ద్వారా రెండేళ్లలో 3.5 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ముందుకు వెళుతుంది.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే..ఈ పథకంలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి తమ యొక్క స్కిల్ నీ డెవలప్ చేసి వారికి ఉపాధిని కల్పించడమే.ఈ పథకాన్ని కేంద్రం 2 విధాలుగా అమలు చేయనుంది.పార్ట్ A మరియు పార్ట్ B.
మనం ఇప్పుడు పార్ట్ A గురించి మాట్లాడుకుందాం..
- పార్ట్ A అనేది నిరుద్యోగులకు సంబంధించింది.
- చదువు ఐపోయి మొదటి సారి ఉద్యోగంలో చేరిన వారికి కేంద్రం 15 వేల రూపాయలను అదనంగా ఇవ్వనుంది.అది కూడా రెండు విడతలుగా
- ఉద్యోగంలో చేరి 6 నెలల ఐపోయాక మొదటి విడతగా 6000 రూపాయలను కేంద్రం ఇస్తుంది. ఉద్యోగంలో చేరి 1 ఇయర్ కంప్లీట్ ఐతే మిగిలిన
- డబ్బులను రెండవ విడతగా ఇవ్వడం జరుగుతుంది.
- ఫర్ example మీరు ఆగస్టు 15th కి డ్యూటీలో జాయిన్ అయ్యారు.అంటే ఆగస్టు 15th నుండి 6 నెలల అంటే ఫిబ్రవరి లో మీకు మొదటి విడత 6000 ఇస్తుంది. సంవత్సరం పూర్తయినక మిగిలిన డబ్బులను కేంద్రం ఇస్తుందన్నమాట
- ఈ డబ్బులు థర్డ్ పార్టీ లేకుండా నేరుగా ఉద్యోగి యొక్క బ్యాంకు అకౌంట్లో కి జమ చేస్తుంది.దీని ద్వారా ఉద్యోగి లాస్ అవ్వకుండా ఉంటారు.ఇలా నేరుగారే ఖాతాలోకి డబ్బు జమ కావాలి అంటే మీ బ్యాంకు అకౌంట్ మీ పాన్ కార్డు కి మరియు ఆధార్ కార్డు కి లింక్ అయ్యి ఉండాలి అలా ఐతేనే
- మీకు కేంద్రం అందిస్తున్న భరోసా నిధులు జమ అవుతాయి.
- ఈ పథకం కిందా లక్ష లోపు జీతం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చూసుకోవచ్చు.
- ఈ పథకం కిందా స్కిల్ డెవలప్ అవుతుంది.
ఇక్కడివరకు అర్థం అయింది కదా ఇంకా పార్ట్ B చూద్దాం
- ఇది ప్రైవేటు కంపెనీలకు సంబంధించింది.
- ఒక కంపెనీ తమకు 50 మందికన్న తక్కువ సిబ్బందితో కంపెనీని రన్ చేస్తే వాళ్ళు కనీసం ఇద్దరు నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలి.50 కన్న ఎక్కువ మందితో కంపెనీ రన్ చేస్తే వాళ్ళు అదనంగా 5 గురిని హయ్యర్ చేసుకోవాలి.అప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఎందుకంటే శక్తికి మించి ఉద్యోగులను హయ్యర్ చేసుకోవడమే కొన్ని సార్లు కంపెనీలు క్లోజ్ కూడా చేయొచ్చు.కాబట్టి అదనంగా ఉద్యోగులను చేర్చుకున్న కంపెనీలకు కేంద్రం ఒక్కో ఉద్యోగి పేరు మీద 3000 రూపాయలు కంపెనీకి ఆర్థిక సహాయం చేయనుంది.
- ఈ విధంగా హయ్యర్ చేసుకున్న కంపెనీలు కచ్చితంగా 6 నెలల వరకు వారితో విధులు నిర్వర్తించుకోవాలి.
- ఈ విధంగా చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడంతో పాటు ఈ 6 నెలల ఒక కంపెనీలో పనిచేసినందుకు వారికి స్కిల్ డెవలప్ అయ్యి మరో కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది.
- ఈ పథకం యొక్క tenure 2 సంవత్సరాలు ఐతే మాన్యుఫాక్చరింగ్ చేసే కంపెనీలకు ఈ టేనోర్ 4 years వరకు ఉంటుంది.
అర్హులు
• ఈ పథకం కింద ఆగస్టు 1 ,2025 నుండి జూలై 30 2027 వరకు ఉద్యోగంలో చేరిన వాళ్ళు అర్హులు
• లక్ష లోపు జీతం ఉండాలి
• 01.08.2025 కి ముందు EPFO లేదా మినహాయింపు ట్రస్ట్‌లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో కంట్రిబ్యూటింగ్ సభ్యులు కానివారు మరియు వారి కాంట్రిబ్యూషన్ మొదటిసారిగా వేతన నెల ఆగస్టు 2025 లేదా ఆ తర్వాత EPFO లేదా మినహాయింపు ట్రస్ట్‌లో స్వీకరించబడింది.
ఎలా అప్లై చేసుకోవాలి
ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. https://pmvbry.epfindia.gov.in/ or https://pmvbry.labour.gov.in/
కావలసిన డాక్యుమెంట్స్
మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క pf ఖాతాకు సంబంధించిన UAN నెంబర్ అవసరం. Guidlines