High Court bans entry of children into theatre
సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రా.11 నుంచి ఉ.11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది.
రైతు ప్రస్థానం: సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రా.11 నుంచి ఉ.11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను FEB 22కు వాయిదా వేసింది.రా. 11 నుంచి ఉ.11 లోపు థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై హైకోర్టు ఆంక్షలు విధించడంపై అప్పీల్ పిటిషన్ దాఖలైంది. ఆ తీర్పుతో తాము నష్టపోతామని మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్లో ఉన్నందున అప్పీలుపై జోక్యం చేసుకోలేమని CJ బెంచ్ స్పష్టం చేసింది. ఆ పెండింగ్ పిటిషన్లోనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.