Hevy Market Demand Crop In Telanagan
దేశానికి వెన్నుముక రైతు కానీ రైతు కాలానికి అనుగుణంగా భూమికి అనుగుణంగా మార్కెట్ కు అనుగుణంగా సాగు చేస్తే ఆనందం.కానీ సాగు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు రైతులు కొనసాగుతున్నారు.. కొంతమంది రైతులు మార్కెట్‌కు తగ్గట్టు ఏ పంటకు మంచి ధర ఉంటుందో ముందుగానే అంచనా వేసి ఒక ప్లానింగ్‌తో కొందరు మాత్రమే ట్రెండీ పంటను సాగుచేస్తారు. అలాంటి వాళ్లే అరెకరం భూమితో కూడా కోట్లు సంపాందించి ఇది వ్యవసాయం చేసే విధానమా అని చూపిస్తున్నారు.మార్కెట్కు అనుగుణంగా రైతులకు లాభాలను అందిస్తున్న ఒక పంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పంటను తెలంగాణ మాజీ సీఎం పండించి బాగానే సంపాదించారు. ఇప్పుడు మన దేశంలో క్యాప్సికం సాగు అతి వేగంగా విస్తరిస్తోంది.క్యాప్సికంలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు అనే మూడు ప్రధాన రకాల క్యాప్సికంను దేశంలో విస్తృతంగా పండిస్తున్నారు. వీటికి మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. క్యాప్సికం ప్రత్యేకత ఏమిటంటే మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా రైతులు తాము పండించాలనుకునే రంగును ఎంపిక చేసుకోవచ్చు. ఆకుపచ్చ క్యాప్సికానికి ధర తక్కువే అయినా కూడా ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోతుంది. అలాగే ఎర్ర క్యాప్సికానికి ధర ఎక్కువ కానీ సెఅసొంలో అమ్ముడుపోతుంది.
రైతులు ఒకే పొలంలో మూడు రకాల క్యాప్సికంను పండించి, ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా మంచి ఆదాయం పొందవచ్చు. ఇక తెలంగాణలో క్యాప్సికం సాగు విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంత వాసులు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా తన ఫామ్ హైజ్‌లో క్యాప్సికం సాగు చేశారు. ఇవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అర ఎకరం భూమిలో క్యాప్సికం సాగు చేయడానికి రూ.15,000 నుండి రూ. 20,000 వరకు ఖర్చవుతుంది, కానీ పంట పూర్తయ్యే సరికి రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు లాభం వస్తుంది. ఇది సాంప్రదాయ పంటలతో పోలిస్తే చాలా ఎక్కువ రాబడి.
వేసవిలో కొంత ఎక్కువ జాగ్రత్త అవసరమైనప్పటికీ, సరైన నీటి సరఫరా, సకాలంలో ఎరువులు వేసినట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది.క్యాప్సికం సాగు ప్రారంభించడానికి రైతులు ముందుగా భూమిని లోతుగా దున్ని, ఆవు పేడ, వర్మీ కంపోస్ట్‌తో చేసిన ఎరువులు కలపాలి. అనంతరం గట్లు తయారు చేసి వాటిపై ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వేస్తారు. ఆ షీట్లలో క్రమంగా రంధ్రాలు చేసి మొక్కలను నాటుతారు. నాటిన తర్వాత క్రమం తప్పకుండా నీటిపారుదల చేస్తే రెండు నెలల్లోనే పండ్లు మొదలవుతాయి. పండ్లు సిద్దమైన వెంటనే మార్కెట్లోకి పంపవచ్చు. ప్రస్తుతం ఎరుపు క్యాప్సికం కిలో ధర రూ.100 వరకు ఉండగా, ఆకుపచ్చ క్యాప్సికం రూ.40–రూ నుంచి రూ.60 వరకు అమ్ముడవుతోంది.









