ఈ మొక్క యొక్క ఉపయోగాలు మీకు తెలిస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు | Health Benifits with Galijeru Aaku Punarnavi 2025

Health Benifits with Galijeru Aaku Punarnavi

ఆధునిక కాలం లో ఉన్న మనకు మన ప్ప్రకృతి చేస్తున్న మేలును గురించి రోబోట్స్ కాలంలో తెలుసుకోలేక పోతున్నాం ఒకవేళ తెలుసుకున్న అవి నిజం అని నమ్మలేక పోతున్నాం.ప్రకృతితిలో బీడు సౌడు భూముల్లో ఎక్కువగా కనిపించే ఒక మొక్క గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ..

తెల్ల గలిజేరు మొక్క గురించించి ఎప్పుడైనా విన్నారా బహుశా మన తండ్రులు తాతలు మాత్రమే విని ఉంటారు.ఇప్పుడు కాలం మారి మొత్తం మిచినే మీదే ఆధారపడి పనిచేస్తుంది యువత ఇలాంటి ఔషధ మొక్కల గురించి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది కొన్ని చోట్ల మొక్కను పునర్నవి అని కుడా పిలుస్తుంటారు. మొక్క మనకు విరివిగా దొరుకుతుంది. మొక్కలు రెండు రకాలుగా ఉంటాయి.ఇవి తెల్ల పూలు పూస్తూ ఉంటె దానిని తెల్ల గలిజేరు అని ఎర్ర పూలు పూస్తూ ఉంటె ఎర్ర గలిజేరు మొక్క అని అంటుంటారు. మొక్కను ఎక్కువగా ప్రకృతి వైద్యంలో ఉపయోగిస్తుంటారు.ఎందుకంటే మొక్కకు ఉన్న ఔషధ గుణం అలాంటిది మరి. మొక్కను ఎక్కువగా ఆయుర్వేద వైద్యలు మొక్కల ఉపయోగాలు చాపుతూఉంటారు.మరి మనం కూడా ఇప్పుడు మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం.

ఉపయోగాలు

  • యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది.
  • దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
  • క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
  • తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి మరగించాలి.
  • చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి.
  • ఇలా 21 రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుందిన నిపుణులు చెబుతున్నారు.
  • ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు.
  • ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండివుంది.
  • ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది.
  • లివర్‌ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.
  • రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలను తగ్గించటంలో అద్భుతం చేస్తుంది.
  • ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి.
  • గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి, వాతం నొప్పులున్న చోట, కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే సులువుగా ఆ నొప్పులన్నీ తగ్గుతాయి.
  • శరీరాన్ని డిటాక్స్‌ఫై చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది .
  • పునర్నవ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది.
  • దీనిని తీసుకోవడం వల్ల మూత్ర నాళాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
  • మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

Leave a Comment