Grama Panchayati Ewelection Shedule Released
స్థానిక ఎన్నికల షెడ్యూల్ SEP తొలి వారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. SEC ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 30న క్యాబినెట్ భేటీలో దీనిపై క్లారిటీ రానుంది. ముందుగా MPTC, ZPTC ఎన్నికలను వచ్చేనెల చివరి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది.
స్థానిక ఎన్నికల షెడ్యూల్ SEP తొలి వారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. SEC ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 30న క్యాబినెట్ భేటీలో దీనిపై క్లారిటీ రానుంది. ముందుగా MPTC, ZPTC ఎన్నికలను వచ్చేనెల చివరి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వారానికే అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. కాగా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకోసం మొత్తంగా ఒకే రోజున రూ.153 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నామని మాజీ సర్పంచులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతలుగా వారివారి సొంత డబ్బులతో చేపట్టినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్డేట్ ఇచ్చింది. SEP 2 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితా ప్రిపేర్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న జిల్లా స్థాయి సమావేశం, 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆగస్టు 28-30 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 31న వాటిని పరిష్కరించాలని పేర్కొంది.