Government Lands on leez with procedure
ఇప్పుడు చాలామంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని సంవత్సరాలుగా ఉపయోగిస్తూన్నారు.అలాంటి భూమిని సొంతంగా నమోదు చేసుకోవాలనుకోవడం సాధారణమైంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు లేదా పేద కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.చట్టాలు కూడా ఒక భూమిని ఆక్రమించినంత మాత్రాన, దానిపై యాజమాన్య హక్కులు ఇవ్వవు. ప్రభుత్వ భూమిని సొంతం చూసుకోబలి అని అనుకుంటే ఖచ్చితమైన నిబంధనలు, చట్టపరమైన మార్గాలు ఉన్నాయి.

కొంతమంది నివాసం కోసం,ఇంకొంతమంది వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ ఉంటారు. ఈవిధంగా చేయడం వల్ల అనేక మండికి వచ్చే ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు ఇది చాలా కాలంగా మన దగ్గరే ఉంది కదా, దీన్ని సొంతం చేసుకోవచ్చా? అనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు.ఇది సాధ్యపడాలంటే ఒక చట్టబద్ధమైన ప్రాసెస్‌ను అనుసరించాల్సి ఉంటుంది
.
ప్రభుత్వ భూమిని ప్రైవేట్ స్థలంగా మార్చడం సాధ్యపడేది కాదు.ఎందుకంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చట్టాన్ని గుర్తు చేసుకోవాలి 1963లో అమల్లోకి వచ్చిన లిమిటేషన్ యాక్ట్ ప్రకారం, ప్రైవేట్ భూమిపై ఎవరైనా నిరంతరంగా 12 సంవత్సరాల పాటు అడ్డంకుల్లేకుండా వాడుకుంటే, ఆ భూమిపై హక్కు కలిగే అవకాశం ఉంది.అయితే ఈ చట్టం ప్రభుత్వ భూములపై వర్తించదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అనేవి ప్రజలందరిది, అంటే “పబ్లిక్ ప్రాపర్టీ.” సుప్రీంకోర్టు కూడా ఎన్నో కేసుల్లో ఈ అంశాన్ని స్పష్టంగా తెలిపింది.

ఎవ్వరూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దానిని తమ పేరుపై చేసుకోలేరు.కొన్ని చట్టపరమైన మార్గాలు మాత్రం ఉన్నాయి. ప్రభుత్వ భూమిని యాజమాన్యంగా పొందడానికి ముఖ్యమైన రెండు మార్గాలు ఉన్నాయి – లీజ్ మరియు పట్టా . అనేక రాష్ట్రాల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉపయోగిస్తున్న నిరుపేదలకు లేదా భూమిలేని కుటుంబాలకు ప్రభుత్వం భూమిని లీజు రూపంలో ఇవ్వవచ్చు.

లీజు పొందాలంటే, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది . దానికి సంబంధించి దరఖాస్తుదారుడు తమ తహసీల్దార్ కార్యాలయాన్ని లేదా రెవెన్యూ శాఖను సంప్రదించాలి. దరఖాస్తుతోపాటు, వారు ఆ భూమిని ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు, ఏ అవసరాలకు ఉపయోగిస్తున్నారు వంటి వివరాలను తెలపాలి. అలాగే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ లేదా నీటి బిల్లులు, స్థానిక సర్టిఫికెట్లు లేదా పాత రికార్డులు వంటి ఆధారపత్రాలను అందించాలి. ఇవి భూమిని నిజంగా వారు వాడుతున్నారన్న విషయాన్నీ రుజువు చేస్తాయి.

- ఈ దరఖాస్తును సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత, భూమి స్థితిని పరిశీలించడానికి స్థలన్నీ తనిఖీ చేస్తారు.
- ఆ తరువాత భూమి లీజు ఇవ్వాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.
- కొన్ని సందర్భాల్లో, లీజు కోసం కొంత రుసుం కూడా వసూలు చేస్తారు.
- ఇది భూమి వర్గం మరియు లీజ్ వ్యవధిని బట్టి మారవచ్చు.కొంతమంది కోర్టు ద్వారా తమ హక్కులను సాధించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది చాలా కష్టమైన మార్గం.
- కోర్టులు ప్రభుత్వ భూముల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తాయి.
- ప్రభుత్వ భూములు అన్నింటికన్నా ముందు పబ్లిక్ భూములుగా గుర్తించబడతాయి.
- కాబట్టి వాటిని ఎవరూ సొంతంగా తీసుకోవడం సాధ్యం కాదు. అయినప్పటికీ, మీరు కోర్టు మార్గాన్ని అనుసరించాలని భావిస్తే బలమైన మరియు ఎక్సపీరియెన్సుడ్ న్యాయవాదిని సంప్రదించాల్సి ఉంటుంది.
- కొన్నిసార్లు ప్రభుత్వమే కొన్ని భూములను ప్రాజెక్టుల రూపంలో లీజుకు లేదా అమ్మకానికి ఇస్తుంది. అలాంటి అవకాశాల గురించి తెలుసుకోవాలంటే, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వేసే నోటీసులు, లేదా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను తరచూ పరిశీలించడం అవసరం.

ఈ ప్రాజెక్టుల కింద ఖచ్చితమైన అర్హతలు, దరఖాస్తు గడువులు వుంటాయి. అవన్నీ గమనించి సరైన సమయంలో దరఖాస్తు చేయడం ద్వారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.అంతిమంగా చెప్పాలంటే, ప్రభుత్వ భూమిని వినియోగించడం వేరు, దానిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కు పొందడం వేరు. దానికోసం సరైన చట్టపరమైన మార్గాన్ని అనుసరించాలి. ఆక్రమణ ద్వారా కాకుండా, ప్రభుత్వ నియమాలు, నిబంధనల ప్రకారం ముందుకెళ్లడం వల్లే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దయచేసి అధికారిక సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా నిపుణుల సలహా తీసుకోండి.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here










