Google New Ai Data center in Andhra Pradesh
గూగుల్ రాకతో రాష్ట్రం సర్వముఖాభివృద్ధి దిశగా పయనిస్తుందని పల్నాడు జిల్లా మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.ఏడాది పాటు శ్రమించి, నేషనల్ పాలసీలో మార్పులు చేసి మరి 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే గూగుల్ క్లౌడ్ ను సంస్థను రాష్ట్రానికి తీసుకురావడం ఆషామాషి విషయం కాదన్నారు.
హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ రావడంతో అక్కడ సాంకేతిక అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో, అలానే గూగుల్ క్లౌడ్ ఏపీకి రావడం భవిష్యత్తులో అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనున్నదని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here