Good news : రైతులకు ఆగస్ట్ 15 నుండి రైతు భీమా అర్హతలు ఇవే
రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల రుణామాఫిని చేసింది.ఇప్పుడు రైతు బీమాను దివాడానికి ముందుకు ఒచ్చింది.
రైతులకు ఆగస్ట్ 15 నుండి రైతు భీమా
రైతులు తమ చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని తాము ఉంచుకోకుండా పంట ఇంటికి వచ్చే వరకు అయిన ఖర్చును దాటడం కోసం దిగుబడి వచ్చిన పంటను మొత్తం అమ్మివేసి బ్యాంకుల్లో ఉన్న రుణాలను కడుతూ ఉన్నారు.కొంతమంది రైతులు సరైన దిగుబడి మరియు గిట్టు బాటు ధరలు లేఖ బ్యాంకులో ఉన్న అప్పును కట్టలేక పోయేవారు.దీంతో వడ్డీలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో అయితె వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాము అమలులోకి వస్థే రైతులకు 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తాం అని ప్రకటించడం జరిగింది.ప్రకటించిన విధంగానే రైతులకు 3 దశల్లో రుణమాఫీ ప్రక్రియను జరిపింది.ఇప్పటివరకు రైతులకు మొదటి విడతలో భాగంగా లక్ష లోపు రుణం ఉన్న 11.50 లక్షల రైతు కుటుంబాలకు గాను 6098 కోట్లతో అయితె రుణాన్ని మాఫీ చేసింది.అలాగే రెండోవ విడతలో లక్షన్నర లోపు రుణం ఉన్న 6.50 లక్షల రైతులకు గాను 7 వేల కోట్లను విడతల చేశారు.ఇప్పుడు ఆగస్టు 15 నా మిగిలిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు.ఇపుడు ఇదే నెలలో రైతులకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భీమా పథకాన్ని అమలు చేయబోతున్నారు.దీనికి సంబంధించి అర్హతలను అయితె విడుదల చేయడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం.రాష్ట్రంలో నిరుపేద రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ రైతు బీమాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2024–25 సంవత్సరానికి గాను ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించనుంది
అర్హతలు – Eligibility
- 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
- రాష్ట్రంలో మొత్తం 75.86 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా.. గతేడాది జూన్ వరకు మరో 3.22 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినట్లుగా వ్యవసాయ శాఖ గుర్తించింది.
- అందులో 2.32 లక్షల మంది మాత్రమే రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అన్ని అర్హతలు ఉండి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని వారితో కలిపి 2.71 లక్షల మంది అర్హులని తేల్చారు.
- అదేవిధంగా జూలై 30 నాటికి 60 ఏ దాటిని వారిని పథకం నుంచి తొలగించి మిగతా అర్హులైన 45.13 లక్షల మంది ఇన్సూరెన్స్లను రెనూ చేయాలని అధికారులు నిర్ణయించారు.
- కొత్తగా అర్హులైన 2.74 అదేవిధంగా జూలై 30 నాటికి 60 ఏళ్లు దాటిని వారిని పథకం నుంచి తొలగించి మిగతా అర్హులైన 45.13లక్షల మంది ఇన్సూరెన్స్లను రెన్యూవల్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
- కొత్తగా అర్హులైన 2.74లక్షల మందికి కలిపి మొత్తం 47.87 లక్షల మంది రైతులను ప్రభుత్వం రైతు బీమాలో భాగస్వాములను చేయనుంది.
- ఏడాదికి ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున సర్కారే ప్రీమియం చెల్లిస్తుంది.రైతు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందనుంది.
- దిని ద్వారా రైతులకు ఎంతోకొంత భీమా సౌకర్యం కలిపిచనుంది.
గమనిక : ఇలాంటి మరిన్ని విషయాల కోసం రైతూ ప్రస్థానం (www.rythuprasthanam.com)గురించి వెతకండి.
1 thought on “Good news : రైతులకు ఆగస్ట్ 15 నుండి రైతు భీమా అర్హతలు ఇవే”