Ghaati Movie Review In Telugu 2025
అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటీ ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం.ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాఫియా బ్యాక్ డ్రోప్లో జరిగే ఈ చిత్రానికి సంబంధిచి విశేషాలు ఒకసరి తెలుసుకుందాం
అనుష్క శెట్టి , విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాటి’ చిత్రం నేడు (సెప్టెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.యూ వి క్రియేషన్ సంస్థా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆంధ్ర – ఒడిశా బోర్డర్ లోని తూర్పు కనుమలలో ఈ కథ మొదలవుతుంది. తూర్పు కనుమల గుండా గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ‘షీలావతి’ అనే రకం గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్.అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు అంత గంజాయి మోయడానికి కూలిగా ఏలుతూ ఉంటారు.అలాంటి ఒక గ్రామానికి చెందిన జంటనే షీలావతి (అనుష్క) దేశిరాజు ( విక్రమ్ ప్రభు).చిన్నప్పుడే శీలావతి తన తల్లిని పోగొట్టుకుంటుంది,దేశి రాజు పోలీసుల కాల్పుల్లో తండ్రిని పోగొట్టుకుంటాడు .
శిలావతి కనుమల గ్రామంలో బస్సు కండెక్టరుగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అదే గ్రామంలో దేశి రాజు ల్యాబ్ టెక్నీషియన్ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు.వీరిద్దరూ ప్రేమించుకుంటారు.పెత్తందారులు కాష్టాల రాయుడు (రవీంద్ర విజయ్), కుందల నాయుడు (చైతన్య రావు). ఎత్తైన కొండలు ఎక్కి గంజాయి పంటను సాగు చేసే నేపథ్యంలో చాలామంది కూలీలు ప్రాణాలను కోల్పోతుంటారు. తండ్రి మరణం తర్వాత తల్లికి ఇచ్చిన మాట కోసం గంజాయి మూసే ఘాటీ పని వదిలేసిన ల్యాబ్ టెక్నీషియన్ దేశిరాజు (విక్రమ్ ప్రభు), అతని మరదలు – బస్ కండక్టర్ శీలావతి (అనుష్క)ను నాయుడు బ్రదర్స్ ఎందుకు టార్గెట్ చేశారు? ఓ సాధారణ ఘాటీ నుంచి ఘాటీలను ఏకం చేసే నాయకురాలిగా శీలావతి ఎలా ఎదిగింది? ఈ ప్రయాణంలో పోలీస్ విశ్వదీప్ రావత్ (జగపతి బాబు), మాజీ మిస్ ఇండియా నీరాలి (లారిస్సా బోనెసి), మహావీర్ (జిష్షుసేన్ గుప్తా) పాత్ర ఏమిటి? వాళ్ళు ఎవరు? అనేది సినిమా.
అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమతి.. వంటి సినిమాల్లో చాలా బలమైన పాత్రలు చేసిన అనుష్క.. మళ్లీ హీరోల పక్కన సాధారణ హీరోయిన్గా పాటల కోసమో.. రెండు మూడు సీన్ల కోసమో సినిమాలు చేస్తుంది అనుకోవడం అత్యాశే. కథనాయకుడితో సమానంగా కథానాయికకి ప్రాధాన్యత కల్పించడం అనేది చాలా అరుదు. టాలీవుడ్ అయితే మహా అరుదు. కానీ అనుష్కకి మాత్రం.. తాను నటించి పేరు తెచ్చిన చిత్రాలన్నింటిలోనూ హీరోతో సమానంగా ఆమెకి పేరు తీసుకుని వచ్చాయి. చాలా వరకూ లేడీ ఓరియెంటెండ్ సినిమాలే చేయడంతో.. చిత్ర విజయంలో పూర్తి క్రెడిట్ ఈమెకే దక్కింది. కాబట్టి సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అనుష్క.. ‘ఘాటి’ చిత్రంతో మరోసారి యాక్షన్ మోడ్‌లోకి దిగింది.