Gadder Award Function Started on April
సినీ నటులకు ఇచ్చే గద్దర్ అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. ఫీచర్, జాతీయ సమైక్యత, బాలలు, హెరిటేజ్, పర్యావరణం, చరిత్ర, డెబిట్ ఫీచర్, యానిమేషన్, సోషల్ ఎఫెక్ట్స్, డాక్యుమెంటరీ చిత్రాలకు ఈ పురస్కారం అందిస్తారు.
సినీ నటులకు ఇచ్చే గద్దర్ అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. ఫీచర్, జాతీయ సమైక్యత, బాలలు, హెరిటేజ్, పర్యావరణం, చరిత్ర, డెబిట్ ఫీచర్, యానిమేషన్, సోషల్ ఎఫెక్ట్స్, డాక్యుమెంటరీ చిత్రాలకు ఈ పురస్కారం అందిస్తారు. అలాగే నటులు, టెక్నీషియన్లతోపాటు తెలుగు సినిమాలపై పుస్తకాలు, వ్యాసాలు రాసినవారికీ ఈ అవార్డులు ఇస్తారు. BRS హయాంలో వచ్చిన సినిమాలకూ ఈ అవార్డు ఇవ్వనున్నారు.ఏప్రిల్లో గద్దర్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు నిర్మాత, FDC ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాదికి సంబంధించి ఒక ఉత్తమ చిత్రానికి అవార్డులు ఇస్తామని తెలిపారు. 2024 ఏడాది సినిమాలకు కొన్ని మార్పులు చేర్పులతో పాత రోజుల్లోని అవార్డుల ప్రక్రియనే కొనసాగిస్తామని వెల్లడించారు. పైడి జయరాజ్, కాంతారావు పేరుతో ఈ అవార్డులు ఇస్తామన్నారు.