రైతులు రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ | Farmers demand RRR alignment change

Farmers demand RRR alignment change

ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కోరిన రైతులు

పాలముర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో డీకే అరుణకు వినతి పత్రం అందజేత.

కొందుర్గు:  మండల పరిధిలోని తంగల్లపల్లి, అగిరాల, చెరుకుపల్లి, గంగన్నగూడ గ్రామ రైతులు రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పాలమూరు ఎంపీ డీకే అరుణకు రైతులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… తమ గ్రామాల వ్యవసాయ భూములపై రహదారి నిర్మాణం చేపట్టడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులు ఆధారపడి జీవిస్తున్న పొలాలు నాశనం అవుతున్నాయన్నారు. సుమారు 400 ఎకరాల భూమి రోడ్డులో కలిసిపోతుందని, 200 మంది రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వస్తోందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పెద్ద భూస్వాముల కోసం ఇష్టారీతిన అలైన్మెంట్లు మార్చి, రైతులను నష్టపరిచేలా వ్యవహరిస్తోందని ఎంపీ అరుణ అన్నారు. భూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి కొందుర్గు మండల అధ్యక్షుడు చిట్టెం లక్ష్మికాంతరెడ్డి, మాజీ సర్పంచ్ బాలరాజు, మైపాల్ రెడ్డి, మల్లారెడ్డి, రవిందర్ రెడ్డి, మల్లెష్, శ్రీశైలం, హన్మంతు, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment