పోడు భూములకు రైతులకు వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి | Farmers bigins strike for land patta passbook 2025

Farmers bigins strike for land patta passbook

పోడు భూముల సాగు చేస్తున్న భూములకు పట్టా ఇవ్వాలని గిరిజన రైతులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషనర్, ఎస్సీ ఎస్టీ కమిషనర్ కార్యాలయముందు నిరసన వినతి అందజేసిన గిరిజన సంఘాల నాయకులు రైతులు.

పోడు భూముల  రైతులు పై అక్రమ కేసులు  ఎత్తివే వేయాలని  సాగు చేస్తున్న భూములకు  పట్టాలు ఇవ్వాలని  కోరుతూ  తెలంగాణ గిరిజన సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  పానగల్ మండలం కిష్టాపూర్ గ్రామ   పోడు భూముల రైతులు సోమవారం రోజు ఎస్సీ ఎస్టీ కమిషనర్,  రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం తరలి వెళ్లి రెండు  కార్యాలయం ముందు గిరిజన రైతులు నిరసన  తెలియజేశారు అనంతరం  వివిధ సమస్యల  కూడిన వినతి పత్రాన్ని సంబంధిత చైర్మన్ ,కమిషనర్లకు. వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్ మాట్లాడుతూ కిష్టాపూర్ గ్రామ రైతులు80 సంవత్సరాల నుంచి12 ఎకరాల భూమిని 25 మంది రైతులు సాగు చేస్తున్నారని వారు ఉన్నారు ఈ భూమిలో బోర్లు బావులు ఉన్నాయని వారన్నారు సంబంధించిన రెవెన్యూ అధికారులు 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నట్లు పట్టేదారు పాస్  బుక్కులు రెవెన్యూ అధికారులు రైతులకు ఇవ్వడం జరిగిందని వారు  పేర్కొన్నారు.

భూమి సాగు కోసం పెట్టుబడులకు బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు రైతులకు ఆ భూమి మీద సర్వ అధికారులు ఉన్నప్పటికీ ఆ భూమి మీద నుండి గిరిజన రైతులకు  వెళ్ళగొట్టడానికి  ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని వారన్నారు వారు అన్నారు ఈ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత కమిషనర్లకు చైర్మన్ కు వివరించినట్లు వారు పేర్కొన్నారు/ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు రవి నాయక్ బాబు హనుమంతు.

Leave a Comment