Farmers Best Subsidy Scheme in Telangana
రైతుకు అయినా కష్టపడనిదే ఏదీ అంత సులభంగా చేతికి రాదు.కొన్ని సార్లు ఆ పంటకు అధిక దిగుబడి రాక అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే పండ్లు, కూరగాయలు, పూల తోటల సాగును పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పథకాలు,రాయితీ(సబ్సిడీ)లను అందిస్తున్నాయి.
ఏ రైతుకు అయినా కష్టపడనిదే ఏదీ అంత సులభంగా చేతికి రాదు.కొన్ని సార్లు ఆ పంటకు అధిక దిగుబడి రాక అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే పండ్లు, కూరగాయలు, పూల తోటల సాగును పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పథకాలు,రాయితీ(సబ్సిడీ)లను అందిస్తున్నాయి. ఇవి రైతులు అధిక లాభాలు సంపాదించుకోవడానికి మరియు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడతాయి.అయితే నేషనల్ హార్టికల్చర్ బోర్డు (NHB) ద్వారా రైతన్నలకు భారీగా సబ్సిడీలు అందుతున్నాయి.
ముఖ్యంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH), నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పథకాలు ముందంజలో ఉన్నాయి. ఎవరికైన సొంతంగా భూమి ఉండి, కొత్త పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండించాలనుకుంటున్నారో, వారికి ఈ పథకాలు బాగా పనికొస్తాయి.నెట్ హౌస్, గ్రీన్ హౌస్ కింద.. 2,500 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో క్యాప్సికం, టమాటా, కీర, దోసకాయ లాంటి కూరగాయలు, లేదా ఆర్కిడ్, గులాబీ,-అంథూరియం లాంటి పూల సాగుకు NHB ఏకంగా రూ.1.12 కోట్ల వరకు మంజూరు చేస్తోంది. ఇందులో 50 శాతం సబ్సిడీగా వస్తుంది.
ఈ డబ్బుతో నెట్ హౌస్‌లు, గ్రీన్ హౌస్‌లు, పక్షుల నుంచి రక్షించే యాంటీ-బర్డ్ నెట్స్, సొరంగాలు, వడగళ్ల నుంచి కాపాడే హెయిల్ నెట్స్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.పండ్ల తోటల సాగుకు: ఐదు ఎకరాల విస్తీర్ణంలో మామిడి,నిమ్మ, నారింజ, రేగు, సీతాఫలం, అరటి, దానిమ్మ లాంటి పండ్ల తోటలు వేయడానికి దాదాపుగా రూ.75 లక్షల వరకు ఇస్తారు. ఇందులో 40 శాతం (రూ.30 లక్షలు) సబ్సిడీగా అందుతుంది. భూమిని చదును చేసుకోవడం, బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), వ్యవసాయ పనులకు యంత్రాలు (యాంత్రీకరణ), నీటిపారుదల వసతులు, పంట ప్యాకింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వంటి వాటికి ఈ డబ్బును వాడుకోవచ్చు.
రాయితీలు..
రైతులు పండించిన పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు,ప్యాక్ హౌజ్లు చాలా ముఖ్యం. వీటి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తోంది.
- ప్యాక్ హౌస్లు, రీపేనింగ్ చాంబర్లు,శుద్ధి యూనిట్లు, శీతలీకరణ నిర్మాణాలకు సుమారుగా రూ.1.45 కోట్ల వరకు ఇస్తారు. ఇందులో 30 శాతం సబ్సిడీగా అందుతుంది.
- అలాగే.. 5 వేల నుంచి 10 వేల టన్నుల సామర్థ్యం ఉండే కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 35 శాతం సబ్సిడీ లభిస్తుంది.
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 20 గుంటల విస్తీర్ణంలో తీగజాతి కూరగాయలకు పందిరి వేసుకోవడానికి రూ.50 వేల సబ్సిడీ ఇస్తారు.
- ఇది గరిష్టంగా 220 ఎకరాల వరకు పొందవచ్చు.
- చిన్న,సన్నకారు రైతులు ఈ విధంగా పందిరి సాగుతో నిరంతరం ఆదాయం సంపాదించుకోవచ్చు.
- ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్’ పథకం ద్వారా ఆయిల్ పామ్ సాగును బాగా ప్రోత్సహిస్తున్నారు.
- ఒక హెక్టారుకు 143 మొక్కలు అవసరమవుతాయి.ఒక్కో మొక్క ధర రూ.193 ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా ఉచితంగా ఇస్తారు.
- ఆయిల్ పామ్ తోటలో మొదటి నాలుగేళ్లు అంతర పంటలు వేసుకోవచ్చు.
- దీనికోసం ఏడాదికి హెక్టారుకు రూ.5,250 చొప్పున, నాలుగేళ్లకు రూ.21,000 సబ్సిడీ ఇస్తారు.
- ఎరువులు, పురుగుమందులకు కూడా ఇదే మొత్తంలో రాయితీ వస్తుంది.
- ‘బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద డ్రిప్, స్ప్రింక్లర్లకు కూడా రాయితీలు ఉన్నాయి.
- ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఐదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తుంది.
దరఖాస్తు విధానం..
- కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనుకూలమైన ప్రాంతాలను క్లస్టర్లుగా గుర్తించి.. రూ. 145 కోట్ల కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులను జోడించి రైతులను ప్రోత్సహిస్తున్నారు.
- ప్రతి జిల్లాకు రూ.4.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ మామిడి. జామ, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, దానిమ్మ లాంటి తోటల సాగును పెంచడానికి మొక్కలు, ఎరువులు, నీటి సౌకర్యాలకు రాయితీలు అందిస్తున్నారు.
- ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం.రైతులు NHB పథకాల కోసం ‘సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)’ తో బ్యాంకులను సంప్రదించి, రుణం ఇస్తామనే సంసిద్ధత లెటర్ తీసుకోవాలి.
- ఆ తర్వాత www.nhb.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి, ఆధార్, పాన్కార్డు, పట్టాదారు పాస్బుక్, ఈసీలు వంటి పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- హైదరాబాద్ లోని అబిడ్స్, చిరాగ్ అలీ లేన్లో ఉన్న NHB ప్రాంతీయ కార్యాలయంలో కూడా ఈ పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
- ఉద్యాన శాఖ గ్రామ స్థాయిలోనే సదస్సులు ఏర్పాటు చేసి, ఈ అవకాశాల గురించి రైతులకు అవగాహన కల్పించనుంది.
- రైతన్నలు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని, తమ జీవితాలను బాగు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here










My brother suggested I might like this website He was totally right This post actually made my day You cannt imagine just how much time I had spent for this information Thanks
This is a great article, i am simply a fun, keep up the good work, just finish reading from https://websiteerstellenlassenbamberg.de// and their work is fantastic. i will be checking your content again if you make next update or post. Thank you