Experts telling be careful with sunstroke
రాష్ట్రంలో ఎండలు తీవ్రరూపం దాల్చనుందని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవని నిపుణులు చెపుతున్నారు.ఉగాది పండుగా మూగిసిన వెంటనే ఎండలు తీవ్రతరూపం దాల్చుతాయి
రాష్ట్రంలో ఎండలు తీవ్రరూపం దాల్చనుందని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవని నిపుణులు చెపుతున్నారు.ఉగాది పండుగా మూగిసిన వెంటనే ఎండలు తీవ్రతరూపం దాల్చుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎండల బారినుండి తప్పించుకోవడం కోసం వెంట గొడుగు లాంటివి లేదా రుమాలు లాంటివి తీసుకువెళ్లాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రాష్ట్రంలో ఇప్పటికే 40 డిగ్రీల మేర ఎండలు మండుతున్నాయి.మరో 10 నున్నచీ 15 రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉంది . ఈ ఎండల కారణంగా ఎక్కువగా గ్లూకోస్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి.డీహైడ్రేషన్ ,వడ దెబ్బ తాకడం వలన కళ్ళు తిరగడం ,వంతులు లాంటి విపత్తు పరిస్థితులకు దారి తీస్తుంది.ఎండా వేడికి చిన్నపిల్లలు మరియు ముసలి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి బయటకు రాకుండా ఉండడమే మంచిది.చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లకుండా తల్లి దండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు.ఒక వేళా బయటికి వెళ్లిన వెంట ఒక వాటర్ బాటిల్ లేదా ఒక గ్లూకోస్ బాటిల్ పట్టుకుని వెళ్లాలని అందువల్ల వడ దెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అంటున్నారు.