EPFO claim online without Documents submission 2025

EPFO claim online without Documents submission

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించి పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునే వారికి కేంద్రం ఊరట కల్పించింది. పీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు పెళ్లిళ్లు,పిల్లల చదువులు, ఇల్లు కొనుగోలు , వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల సమయంలో పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చన్న సంగతి తెలిసిందే. విత్డ్రా సమయంలో ఆధారాల కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లి ఏమైనా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలా వద్దా అనే దానిపై చాలా మంది ఈపీఎఫ్ సభ్యుల్లో గందరగోళం నెలకొంది. దీనిపైనే ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ‘ఈపీఎఫ్ఓ ఆఫీసులకు వెళ్లి ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేసింది.

పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్‌ను సరళీకరించేందుకు ఇంకా పారదర్శకత పెంచేందుకు క్లెయిమ్ తిరస్కరణ తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో స్పందించింది. పార్లమెంట్ సభ్యులు అయినా విజయ్ వసంత్, మానికం ఠాగోర్ బి, సురేష్ కుమార్ శేట్కర్ ఈ ప్రశ్నలు అడిగారు.

2017లో కేంద్రం తీసుకొచ్చిన కాంపోజిట్ క్లెయిమ్ ఫారం, స్వీయ ధ్రువీకరణ ఆధారంగా పీఎఫ్ అడ్వాన్స్, తుది ఉపసంహరణ క్లెయిమ్ ప్రక్రియను హేతుబద్ధీకరించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పీఎఫ్ ఆన్‌లైన్ క్లెయిమ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

  1. ఇటీవల చాలా వరకు పీఎఫ్ విత్‌డ్రా ఈజీగా చేసుకునేందుకు చాలానే మార్పులు చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లి లేదా తండ్రి పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేర్లు వంటివి యజమాని లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండానే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు.
  2.  ఇక పీఎఫ్ క్లెయిమ్ మొత్తాన్ని వైద్య ఖర్చులు, చదువులు, పెళ్లిళ్లు వంటి వాటి కోసం త్వరగా డబ్బులు అందేందుకు.. దీనిని ఆటో సెటిల్మెంట్ కిందికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని కూడా రూ. 5 లక్షలకు పెంచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది. అంటే ఇక్కడ 3 రోజుల్లోనే ఇక్కడ అకౌంట్లో డబ్బులు జమవుతాయన్నమాట.
  3. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పీఎఫ్ విత్‌డ్రా కోసం చెక్ లీఫ్ లేదా పాస్ బుక్ ఫొటో అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని తొలగించింది. విత్ డ్రా ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్, కేవైసీ గుర్తింపు కోసం అప్లోడ్ చేసే ఫొటోల నాణ్యత సరిగా లేక క్లెయిమ్స్ చాలా వరకు తిరస్కరణలకు గురైనట్లు గుర్తించిన ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకొని ఊరట కల్పించింది.
  4. యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి. దీనికి బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్ నంబర్ లింక్ అయి ఉండాలి. కేవైసీ ధ్రువీకరణ ముఖ్యం.
  5. క్లెయిమ్ సెటిల్మెంట్ తర్వాత డబ్బులు నేరుగా యూఏఎన్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. అప్పుడు సభ్యుడి ఖాతాలోనే డబ్బులు జమవుతాయి. ఇతర ఉల్లంఘనల్ని పర్యవేక్షించేందుకు అంతర్గత ఆడిట్ వ్యవస్థ అమల్లో ఉంది. క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యేందుకు గల కారణాల్ని కూడా 44 నుంచి నుంచి 18కి తగ్గించింది.
  6. ఇదే సమయంలో పీఎఫ్ స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా.. మోసపూరిత క్లెయిమ్స్‌కు దారితీయకుండా ఈపీఎఫ్ఓ పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆధార్ ఓటీపీ లేదా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి పీఎఫ్ మెంబర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యాకే క్లెయిమ్ ఫైల్ అవుతుంది.


Follow On:-



 

Leave a Comment