Ekalavya Model School Jobs 2025 | Latest Job Notification In Telangana | EMRS jobs Notification 2025

Ekalavya Model School Jobs 2025

ఏకలవ్య మోడల్ స్కూల్స్ నందు పనిచేసేందుకు గాను టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ స్టాఫ్ సెలక్షన్ 5 – 2025 (ESSE – 2025) .భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పరిధిలో గల నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ బ్రైబల్స్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్స్, PGT, TGT, ఫిమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7267 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ? జీతభత్యాలు ఎంత లభిస్తాయి ? వంటి వివరాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ను చివరి వరకు చదవగలరు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఏకలవ్య మోడల్ స్కూల్స్ నందు ఉద్యోగాల భర్తీ కొరకు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రావెల్స్ నుండి ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల అయింది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ను 23.10.2025 రాత్రి 11.50 లోపల పూర్తి చేయాలి.

ఈ పోస్ట్ ల వారీగా ఖాళీలు వివరాలు :

భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • ప్రిన్సివల్స్ – 225
  • PGTS-1460
  • TGTS-3962
  • ఫిమేల్ స్టాఫ్ నర్స్ – 550
  • హాస్టల్ వార్డెన్ 635
  • అకౌంటెంట్- 61
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 228
  • ల్యాబ్ అటెండెంట్-146

విద్యార్హత :

  1. ల్యాబ్ అటెండెంట్: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, గుర్తింపు పొందిన సంస్థ నుండి లేబరేటరీ టెక్నిక్ నందు డిప్లమో లేదా సర్టిఫికెట్ పొంది ఉండాలి. ( లేదా ) సైన్స్ స్ట్రీమ్ నందు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో అయితే నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
  3. అకౌంటెంట్ : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి కామర్స్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  4. ఫిమేల్ స్టాఫ్ నర్స్: గుర్తింపు పొద్దున సంస్థ లేదా యూనివర్సిటీ నుండి బిఎస్సి నర్సింగ్ (హానర్స్) ఉత్తీర్ణత/
  5. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (మేల్/ ఫీమేల్) 50 శాతం మార్కులతో నాలుగు. సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.P Ed కోర్సు లేదా 50 శాతం మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ / 50% మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా కలిగిన బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా నేషనల్ స్టేట్, ఇంటర్ యూనివర్సిటీ నందు ఏదైనా ఒక గేమ్ / స్పోర్ట్స్ నందు పాల్గొని ఉండాలి.
  6. TGT లు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు బిఈడి ఉత్తీర్ణత సాధించి, CTET పరీక్ష క్వాలిఫై అయి ఉండాలి.
  7. PET (కంప్యూటర్ సైన్స్) : 50 శాతం మార్కులతో M.Sc (కంప్యూటర్ సైన్స్ / IT ) / MCA / M.E. or M.Tech ( కంప్యూటర్ సైన్స్ /IT) ఉత్తీర్ణత.
  8. హాస్టల్ వార్డెన్ : NCERT లేదా ఇతర NCTE నుండి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ సాధించి ఉండాలి.
  9. ప్రిన్సిపల్: 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ మరియు బిఈడి ఉత్తీర్ణత సాధించి పని అనుభవం కలిగి ఉన్నవారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  10. మ్యూజిక్ టీచర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి మ్యూజిక్ / పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నందు 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ సాధించాలి. ( డిగ్రీ 3 సంవత్సరాలలో మ్యూజిక్ ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి)
  11. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత / పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి, ఏదైనా రాష్ట్ర కౌన్సిల్ నందు నర్స్ లేదా నర్స్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ అయి ఉండి, 50 పడకల ఆసుపత్రి నందు రెండున్నర సంవత్సరాలు పాటు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
  12. లైబ్రేరియన్: ఏదైనా గుర్తింపు సంస్థ నుండి 50% మార్కులతో లైబ్రరీ సైన్స్ నందు డిగ్రీ ఉత్తీర్ణత / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు 50% మార్కులతో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఉత్తీర్ణత.
  13. ఆర్ట్ టీచర్ : డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ / స్కల్ప్చర్ / గ్రాఫిక్ ఆర్ట్స్ / ఫైన్ ఆర్ట్స్ / విజువల్ ఆర్ట్స్ నందు 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ( డిగ్రీ మూడు సంవత్సరాల్లో డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి)
  14. TGT కంప్యూటర్ సైన్స్: 50% మార్కులతో BCA ( బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ) ఉత్తీర్ణత / కంప్యూటర్ సైన్స్ ఐటీ విభాగంలో 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత (డిగ్రీ మూడు సంవత్సరాల్లో కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి) / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నందు 50% మార్కులతో బీఈ లేదా బీటెక్
  15. PGT : సంబంధిత సబ్జెక్ట్ లలో 50 శాతం మార్కులతో ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్ లో 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ (మాస్టర్స్) డిగ్రీ ఉతీరత
వయోపరిమితి :
  • ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 50 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవొచ్చు.
  • PGT ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • TGT, ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కు ఆన్లైన్ విధానం ద్వారా అవకాశం కల్పించారు.

దరఖాస్తు ఫీజు 
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మహిళలు ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నా 500 రూపాయలు దరఖాస్తు ఫీజు ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
  • మిగతా అందరు అభ్యర్థులు పోస్ట్ లను అనుసరించి ప్రిన్సిపల్ ఉద్యోగానికి 2500 రూపాయలు, PGT & TGT ఉద్యోగాలకు 2000 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 1500 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి పోస్టులను అనుసరించి జీతభత్యాలు లభిస్తాయి.

Download Notification
Click Here for Apply

Leave a Comment