Dharani Pending Applications Clearance: రోజుకు 100 చొప్పున అప్లికేషన్లను పరిష్కరించడం లక్ష్యంగా సూచించిన నవీన్
ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో నవీన్‌మిత్తల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Dharani Pending Applications Clearance : ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు ఇప్పుడు మోక్షం కలగనుంది.ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో నవీన్‌మిత్తల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షకు పైగా పెండింగ్‌లో అర్జీలు ఉన్నాయని వెంటనే వాటిని పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తహసీల్దార్ స్థాయి అధికారులు స్వీకరించాలని అన్నారు.ఆర్డీఓ స్థాయి అధికారి అర్జీలను వెరిఫై చేయాలని ఎమ్మార్వో , ఆర్డీఓలు పంపిన వివరాల ఆధారంగా అర్జీలను అడిషనల్ కలెక్టర్ ఆమోదించవచ్చని లేదా తిసస్కరించవచ్చని తెలిపారు. కలెక్టర్ ఫైనల్ చేసిన తర్వాత అడిషనల్ వాటిని ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
గతంలో ధరణిలో అన్ని మడుల్స్ ను కలెక్టర్లు చేయడంతో పని భారం పెరగడం వల్ల అప్లికేషన్లు కుప్పలుగా మారిపోయాయని దీంతో పని భారంతో ఒత్తిడి పెరుగుతునడంతో ప్రతి ఒక్కరి రిజెక్ట్ చేస్తూ వచ్చారని రిజెక్ట్స్ చేసిన తర్వాత మళ్లీ అప్లై చేసుకోవడం ద్వారా భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయని దీంతో కలెక్టర్లపై పని ఒత్తడి పెరిగిపోయింది.ఇప్పుడు వారికి పని తగ్గించి.. అందులో కొన్ని బాధ్యతలు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఆర్డీవోలకు అప్పగించారు. ప్రభుత్వం వచ్చాక 3 సార్లు స్పెషల్ డ్రైవ్‌లు.. అయినా పెండింగ్ ఆప్లికేషన్లు క్లియర్ కాలేదని అన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రిలో ఎక్కువ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గతంలో ధరణి విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నారు.. కొత్త ఆర్వోఆర్ చట్టం ఈ అసెంబ్లీ సెషన్స్‌లో తీసుకొస్తున్నారని చెప్పారు. ఈ లోపు ధరణి పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని నవీన్‌మిత్తల్ తెలిపారు.
పెండింగ్లో భారీ సంఖ్యలో ఉన్నటువంటి అప్లికేషన్లను వాటిని జీరో స్థాయికి తీసుకురావాలని ఆదేశించడం జరిగింది రోజుకు 100 చొప్పున అప్లికేషన్లను పరిష్కరించడం లక్ష్యంగా సూచించినట్లు నవీన్ మిథులు తెలిపారు అదనంగా తాసిల్దార్లకు కూడా లాగిన్లను ఇచ్చినట్టు ఆయన తెలిపారు ఒకవేళ అప్లికేషన్స్ ప్రొజెక్టర్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో రిమార్కులను కూడా యాడ్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అని అన్నారు అప్లికేషన్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత అప్లోడ్ చేయవలసి ఉంటుందని తెలిపారు.దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసేందుకు, వాటి పరిష్కారానికి అవసరమైన రిపోర్టులు అప్‌లోడ్ చేసేందుకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చారు. ఇప్పటి వరకూ తహశీల్దార్లకు ఒకే లాగిన్ ఉండేది.
ధరణిలో వ్యవసాయ భూములకు సంబంధించి రిపోర్టులు రిజిస్ట్రేషన్ లను చేసుకోవడానికి మరొక అలాగే ఇవ్వాలని కలెక్టర్లకు మెత్తల్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఒక లాగిన్ ద్వారా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, మరో లాగిన్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లకు (డీటీ) ఇచ్చిన లాగిన్ ద్వారా ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు.ప్రతి సమస్య పరిష్కారానికీ ఒక ప్రత్యేక మాడ్యూల్ ఉందని.. వాటి ద్వారా అన్నీ పరిష్కరించాలని సూచించారు. పరిష్కారానికి వీలులేని దరఖాస్తులు ఉంటే కారణాలు చెప్పి రిజెక్ట్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రూల్ పొజిషన్‌కు లోబడి పనిచేయాలని ఆదేశించారు.