దాదాపు రెండేళ్ల నుంచి పేలుడు పదార్థాల సేకరణ | Delhi Bom Blast Shocking News 2025

Delhi Bom Blast Shocking News

దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం. వీటిని ఉపయోగించి పాకక్కు చెందిన జైషే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయట పెట్టింది.

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు పై దర్యాప్తులో ఫరీదాబాద్ మాడ్యూల్ (Terror module)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో డాక్టర్ షాహిన్ను అరెస్టు చేసిన అధికారులు తదుపరి విచారణ కోసం శ్రీనగర్ తీసుకెళ్లారు.ఆమె నుంచి అధికారులు విచారణ సమయంలో కీలక విషయాలు రాబట్టారు. దేశంలో బహుళ ఉగ్ర దాడులు చేయడం గురించి ఉమర్ ప్రతిసారీ ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని షాహిన్ తెలిపింది.ఐతే డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్తో కలిసి దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం. వీటిని ఉపయోగించి పాకక్కు చెందిన జైషే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయట పెట్టింది.

ఈ ఫరీదాబాద్ మాడ్యూల్లో తన సోదరుడు పర్వేజ్ సయీద్ కూడా భాగమని పేర్కొంది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే. అతడి నుంచి ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. అరెస్టు అవుతాననే అనుమానంతో వాటిని దాచి ఉంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గురుగ్రామ్కు చెందిన అమ్మోనియం నైట్రేట్ సరఫరాదారుడిని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దాడులు చేసి అతడిని కూడా అరెస్టు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. డాక్టర్ షాహిన్ అరెస్టు వెనక జైషే నెట్వర్క్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. జమాత్ ఉల్ మొమినాత్కు జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తుంది. ఈ విభాగంలో షాహిన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లో మహిళా విభాగాలు స్థాపించి, వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం వెలువడింది. పేలుడు తీవ్రత, దాని ప్రభావాన్ని బట్టి మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్ధాలు ఉపయోగించినట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. విచారణలో దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలియనున్నాయి.

Leave a Comment