Constable arrest with drugs case Telangana:పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి 2024

Photo of author

By Admin

Constable arrest with drugs case Telangana:పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి?

హన్మకొండ జిల్లా: నవంబర్ 30
మత్తు పదార్థాల వాడకాన్ని అరికట్టే బాధ్యత నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ డబ్బు కోసం అక్రమ మార్గం పట్టాడు. ఓ రెయిడ్ లో దొరికిన గంజాయిని సీజ్ చేసి ఠాణాలో పెట్టగా.. సదరు కానిస్టేబుల్ గుట్టు చప్పుడు కాకుండా దశల వారీగా కాజేస్తూ వచ్చాడు.

కాజీపేట పోలీస్ డివిజన్ కరీంనగర్ రోడ్ లోని పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఉన్నతాధి కారులు వెల్లడించిన వివరాల ప్రకారం…నర్సంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గతంలో ఓ రెయిడ్ లో పెద్ద మొత్తంలో పట్టుబడ్డ గంజాయిని అధికారులు ఇదే ఠాణాలో సీజ్ చేసి పెట్టారు. దీనిపై కన్నేసిన సదరు కానిస్టే బుల్.. దశల వారీగా గంజాయిని ఇంటికి తీసుకెళ్లాడు.తన స్నేహితులు, బంధువులకు ఇచ్చి అమ్మించాడు. ఈ క్రమంలో నర్సంపేట నుంచి వరంగల్ వచ్చే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టగా ఓ బైక్ పై వచ్చిన యువకులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించి పట్టుకున్న పోలీసులు వారిని సోదా చేయగా గంజాయి లభ్యమైంది.

ఆ తర్వాత విచారణలో కానిస్టేబుల్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఉన్నతా ధికారులకు సమాచారం అందించి సదరు కానిస్టే బుల్ ఇంట్లో సోదాలు నిర్వహించగా స్టేషన్లో దొంగలించిన గంజాయి దొరికింది.ప్రస్తుతం కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్ ఉన్నతా ధికారులు తెలిపారు.

Leave a Comment