కాంగ్రెస్ పార్టీ వికలాంగులకే కేటాయించాలని డిమాండ్ | Congress demands that party be reserved for the disabled 2026

Congress demands that party be reserved for the disabled

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు రాజ్యసభస్థానాలను, సమాజంలో అత్యంత వెనుకబడిన మరియు రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సామాజిక వర్గానికి అవకాశం కల్పించేలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో ఏర్పాటుచేసిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా, నేటికీ వికలాంగుల సమాజం దుర్భర జీవితాలు గడపటానికి కారణం వికలాంగులకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు లేకపోవటమేనని ముఖ్యంగా సకలాంగుల రాజకీయ నాయకులు వికలాంగుల సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటూ చట్టసభల్లో వికలాంగుల సమస్యలు వినిపించని కారణంగానే నేటికీ దేశంలో వికలాంగుల సమాజం తమ సమస్యల పరిష్కారానికై పోరాటాలు చేస్తూ ఉండవలసిన దారుణ పరిస్థితి వచ్చిందని వికలాంగుల సమస్యలను చట్టసభల్లో వినిపించాలంటే వికలాంగుల సామాజిక వర్గానికి చెందిన వారే చట్టసభల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని.

ముఖ్యంగా దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఆస్తులు, అంతస్తులు ఉన్నవారికే రాజ్యసభ సీట్లు ఇస్తుండటం వల్ల సామాన్య వికలాంగులు అభివృద్ధికి దూరమవుతున్నారని. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో వికలాంగుల హక్కుల కోసం పోరాడే వ్యక్తులకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకునేలా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.

ఒకవేళ వికలాంగుల విజ్ఞప్తిని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు గుగులోతు సైదులు విద్యార్థి సంఘం నాయకుడు నూక హరికృష్ణ స్పెషల్ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు వాంకుడోత్ లాల్ సింగ్ మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

ollow Links

Leave a Comment