CM revanth Reddy Sensational Comments on KCR
బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు. జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబట్టారు.
రైతు ప్రస్థానం : మాజీ CM KCR లాంటి వాళ్లు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయనే కులగణనలో పాల్గొనలేదని CM రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని, వారికి తెలంగాణలో జీవించే హక్కు లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు. జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబట్టారు. KTR, హరీశ్ గ్యాంబ్లర్లు అని విమర్శించారు.KCRను తెలంగాణ నుంచి బహిష్కరించాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘సీఎం పీఠం దక్కినా రేవంత్ బుద్ధి మారలేదు. ఇదే విషయంపై నీ సొంతూరులో ప్రజలను అడుగుదామా? CMగా ప్రజలు నిన్ను గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి KCRపై ప్రేలాపనలా? KCRను తిడితే ఒక్క రోజు హెడ్ లైన్స్లో ఉంటావేమో. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన KCR స్థానం ప్రజల గుండెల్లో పదిలం’ అని Xలో పోస్ట్ చేశారు.