Cm Revanth Reddy Coming To the Thungathurthy
ఇటీవల తుంగతుర్తి టైగర్గా పిలుచుకున్న మాజీ మంత్రి దమ్మన్న మరణం అందరిని కలిచివేసింది.దామన్నకు రేపు దశదిశా కర్మ నిర్వహించనున్నారు.
ఇటీవల తుంగతుర్తి టైగర్గా పిలుచుకున్న మాజీ మంత్రి దమ్మన్న మరణం అందరిని కలిచివేసింది.దామన్నకు రేపు దశదిశా కర్మ నిర్వహించనున్నారు.ఐతే ఆ సభ ఆదివారం తుంగతుర్తిలో జరగనుంది.ఐతే ఈ రాంరెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కర్మలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు వెల్లడించాయి. సంతాప సభకు విచ్చేస్తున్న సీఎం రేవంత్ సభకు సంబంధించి హెలిప్యాడ్ ఏర్పాట్లను ఎస్పీ నరసింహ పరిశీలించారు. అనంతరం సభాస్థలికి వచ్చి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వారి వెంట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, వేణారెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, ఆర్డీవో వేణు మాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఈ పద్మావతి, ఏఈ యుగంధర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Follow On
Arattai Channel: Click Here
Whats app Channel: Click Here
Telegram Channel: Click Here