CM Revanth Reddy Campaigning in Delhi Election: అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ వెంటనే అనుమ‌తులు

Photo of author

By Admin

CM Revanth Reddy Campaigning in Delhi Election: అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ వెంటనే అనుమ‌తులు

తెలంగాణ‌లో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ వెంటనే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌ గారికి విజ్ఞ‌ప్తి చేశారు.ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల‌ను నివేదించారు.

కేంద్ర అట‌వీ శాఖ అనుమ‌తులు రాక‌పోవ‌డంతో తెలంగాణ‌ వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయ‌ని వివ‌రించారు. 38 ప్రాజెక్టుల‌కు వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టాల పర‌మైన అనుమ‌తులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణం అనుమతులు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి గారు కోరారు.ఈ ప్రాజెక్టుల్లో అత్య‌ధికం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉన్నాయ‌ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. అనుమ‌తులు రాక‌పోవ‌డంతో జాతీయ ర‌హ‌దారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ట‌వ‌ర్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, పొరుగు రాష్ట్రాల‌ను అనుసంధానించే ర‌హ‌దారుల నిర్మాణ ప‌నులు నిలిచిపోయాయ‌ని తెలిపారు.

గౌర‌వెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమ‌తుల మంజూరు చేయాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రి గారి విజ్ఞ‌ప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్య‌మంత్రి గారి వెంట మంత్రులు కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Leave a Comment