CM Revanth Reddy Announced Rythu Bharosa Date
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రైతులకు రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తుందో తేదీని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం దీంతో రైతుల్లో వర్షం వ్యక్తం అవుతుంది..
ఖరీఫ్ సీజన్ మొదలై దాదాపు నెల పూర్తవుతూ ఉండడంతో ఇంతవరకు రైతులకు పెట్టబడి సాయంగా అందించవలసిన ఆరువేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అందించలేదు దీంతో రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ముగిసిన వెంటనే రాష్ట్ర రైతులకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.. దీంతో 13వ తారీకున మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే 14వ తారీఖున రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది..
దీంతో రైతులు కొంత ఊరట లభించింది.ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్ని ముగించింది 13 వ తారీకు లెక్కింపు పూర్తవగానే 14 వ తారీకు రాష్ట్ర రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నది. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయడానికి 10 నుంచి 20 రోజుల కాలం పట్టేది అయితే ఇప్పుడు అలా కాకుండా నేరుగా ఒకేసారి రైతుల ఖాతాలో నిదురు సాధ్యమైనంతవరకు జమ చేసే విధంగా చూస్తోంది,, ఇప్పటికే రాష్ట్రంలో యూరియా బస్తాల కొరత ఏర్పడడంతో ఆ కొరతను తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫెర్టిలైజర్ ఆప్ ని ప్రారంభించిన విషయం తెలిసింది. ఈ యాప్ ప్రారంభించడం ద్వారా ప్రతి ఒక్క రైతు తమ ఇంటి వద్దనే కూర్చుని యూరియాను బుక్ చేసుకుని తమ యొక్క స్లాట్ వచ్చిన రోజు రైతులు షాప్ కి వెళ్లి తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు.










