ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కీచకులు | CI misbeheviour with Single Ladies 2025

CI misbeheviour with Single LadiesCI misbeheviour with Single Ladies

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కీచకులుగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల భద్రత కల్పించాల్సిన వాళ్లే.. వేధింపులకు పాల్పడుతున్నారు. అది కూడా మహిళా హోంశాఖ మంత్రి ఉన్న రాష్ట్రంలో కావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల త్రీటౌన్ సీఐగా ఉన్న కంబగిరి రాముడి వ్యవహారం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒంటరి మహిళలే టార్గెట్ గా ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని వరుస ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుస్తోంది.ఇటీవల ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.సీఐ తనను వేధిస్తున్నాడని నంద్యాలకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూడ్ కాల్స్ చేయాలంటూ తనను వేధిస్తున్నాడని చెప్పింది.లేకపోతే తనను, తన పిల్లలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. సీఐ తనతో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ ను మహిళ బయటపెట్టింది.అందులో సీఐ రాముడు చాటింగ్స్ చూస్తే చాలా దారుణంగా, నీచాతి నీచంగా ఉన్నాయి.తనను బెదిరించి తన నగ్న ఫొటోలు పంపేలా చేశాడని చెప్పింది. రెగ్యులర్ గా అదే పని చేస్తున్నాడని తెలిపింది. తన వీడియోలు కూడా ఆయన దగ్గర ఉన్నాయంది..

Leave a Comment