Chilukur Balaji Temple Chief Priest attacked
చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం ఇంట్లో ఉన్న సమయంలో తనపై అటాక్ చేశారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20 మంది ఇక్ష్వాకుల వారసులమంటూ వచ్చి రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరగా నిరాకరించడంతో తనతో పాటు కుమారుడిపై దాడి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనపై మాజీ మంత్రి KTR స్పందించారు. ఈ పిరికి చర్యపై హిందు ధర్మ రక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. ధర్మరక్షకులు దాడులు చేస్తే.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని సెటైర్లు వేశారు.చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై ఇటీవల జరిగిన దాడి ఘటనపై రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.