Chandrababu Fire on TTD Police Officers 2025: 2000 మందికి మాత్రమే పర్మిషన్ ఉండగా 2500 మంది
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దుర్ఘటన పైన స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పలువురు అధికారులను సస్పెండ్ చేశారు.
గత రెండు రోజుల్లో టీటీడీలో జరిగిన దుర్ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు సంఘటన స్థలానికి వెళ్లారు అక్కడికి వెళ్లి అధికారులను ఎందుకు అలా జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ తరువాత జిల్లా కలెక్టర్ మరియు టిటిడి చైర్మన్ ను మందలించారు. ఇది కొత్త ప్లేస్ అంతేకాకుండా 2000 మందికి మాత్రమే పర్మిషన్ ఉండగా 2500 మంది దాకా ఎందుకు రాణించారని వారిని నిలదీశారు. రూల్స్ ప్రకారం పని చేయకుండా ఎందుకు ఇలా చేశారని ఆయన అన్నారు. టిటిడి చైర్మన్ డి.ఎస్.పి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు.తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు కలెక్టర్, టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
2 వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోండని మండిపడ్డారు. అంబులెన్సుల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను CM చంద్రబాబు సస్పెండ్ చేశారు. DSP రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని, వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నా, వాళ్లు సరిగ్గా పనిచేయలేదని CM చెప్పారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, TTD జేఈవో గౌతమి, CSO శ్రీధర్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
జుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ‘ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీల్లేదు. ఘటనపై చాలా బాధపడుతున్నాం. ఇటు టీటీడీ ఛైర్మన్, అటు ఈఓ, మేనేజ్మెంట్, అధికారులు ఇంకా సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ మనస్సాక్షి ప్రకారం సేవకులుగా పనిచేయండి’ అని సూచించారు.తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. ‘వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేవి పవిత్రమే కానీ దాన్ని పది రోజులెందుకు చేశారో నాకు తెలియడం లేదు. స్వామివారు ఇక్కడ వెలువడినప్పటి నుంచీ పాటించే సంప్రదాయాల్ని మార్చకుండా అనుసరించాలనేది నా అభిప్రాయం. ఆ విషయంలో ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు వెల్లడించారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి పరామర్శించారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మరికాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శిస్తారు.తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.