Chandra babu Naidu Good News To BPL Families: పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక ఆదేశాలు

Photo of author

By Admin

Chandra babu Naidu Good News To BPL Families: పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక ఆదేశాలు

పేదలకు ఇళ్ల స్థలాలపై క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని అధికారులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వడంపై కీలక నిర్ణయాలు తీసుకుంది ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పేదలకు ఇల్ల స్థలాలు ఇవ్వడంపై కీలక ఆదేశాలను జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. పేదలకు ఇల్లు ఎలా మంజూరు చేయాలి మరియు వారిని ఆకులుగా ఎలా గుర్తించాలి అన్నదానిపై కరసత్వం చేసిన కేంద్ర క్యాబినెట్ అర్హులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ మార్గదర్శకాలు ఒకసారి చూసుకుంటే..పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు.

‘వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు. BPL ఫ్యామిలీ అయి ఉండాలి. కచ్చితంగా ఆధార్ ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు’ అని పేర్కొన్నారు.అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని చెప్పారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సచివాలయాల్లో RTGS ఏర్పాటుపై CM చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్లో చర్చ జరిగింది. అటు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం గుర్తించింది.వాటిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Leave a Comment