పత్తి రైతులపై మరో బాంబు వేసిన సిసిఐ CCI shocking news to the cotton farmers 2025

CCI shocking news to the cotton farmers

పత్తి రైతుల నెత్తిన మరో పిడుగు 

చిన్న ,సన్న కారు రైతులకు మరో శాపం 

పత్తి కొనుగోలు పై సిసిఐ కొత్త నిబంధన

రైతులు ఎప్పుడు ఇప్పుడే కోరుకుంటున్నారు అని అనుకునే లోపే కాటన్ కొనుగోలు చేసే సంస్థ రైతులకు కొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ నిబంధన వల్ల చిన్న సన్నకరు రైతులకు మరో శాపం తగలనుంది.

రైతు ప్రస్థానం డెస్క్ : పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధన ద్వారా చిన్న సన్నకారు రైతులు అధిక మొత్తంలో ఇబ్బందులకు గురవనున్నారు గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిన పత్తి ఇప్పుడు పత్తి కొనుగోలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. పత్తిపై పగ పెంచుకున్నట్లే ప్రభుత్వం పనితీరు తెలుస్తోంది.

సీసీఐ కొత్త నిబంధన ద్వారా పత్తి కొనుగోలు ఇప్పటికే చాలా ఆలస్యంగా మొదలయ్యాయి అయినప్పటికీ వర్షాల కారణంగా రైతులు చాలావరకు పత్తిని మార్కెట్కు తీసుకుని రాలేదు ఇప్పుడు ఇప్పుడే రైతులు పత్తిని ఆరబెట్టుకొని మార్కెట్కు తీసుకొస్తున్నారు అని అనుకునే లోగానే సిసిఐ కొత్త నిబంధన విడుదల చేసింది. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత ఎకరాకు 12 క్వింటాల చొప్పున పత్తిని కొనుగోలు చేస్తాం అని తెలిపింది దీంతో రైతులు సంతోషంగా ఉండగా ఇప్పుడు ఎకరాకు ఏడు కింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని అంతకుమించి ఎక్కువ మోతాదులో కొనుగోలు చేయడం అని సిసిఐ నిబంధనలో విడుదల చేసింది సోమవారం ఈ నిబంధన విడుదల చేయగా కేవలం 4755 టన్నులు మాత్రమే పత్తి కొనుగోలు చేసింది.

దీంతో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని రాస్తా కాటన్ కార్పొరేషన్ అడగగా తెలంగాణ నుంచి అతి తక్కువ మోతాదులో పత్తి కొనుగోలు ఉన్నాయని దీంతో పత్తి ఎకరాకు 7 క్వింటాల చొప్పున తగ్గించాం అని వివరణ ఇచ్చింది.రాష్ట్రంలో 24.12 లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారు. ఇందులో 70 శాతం మంది మూడెకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులే. ఇప్పటివరకు 7,705 మంది రైతుల నుంచి రూ.119.89 కోట్ల విలువైన 15,229 టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. సోమవారం 10,434 టన్నులు కొనగా… కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక మంగళవారం 4,795 టన్నులు మాత్రమే కొన్నారు. ఏడు క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొంటామని సీసీఐ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాలు కురుస్తున్నాయని, మిగిలిన పత్తిని వెనక్కి తీసుకెళ్లడం సమస్యగా మారుతుందని చెప్పినా అధికారులు ససేమిరా అన్నారు. తేమ శాతం 12 పైగా ఉన్నా కూడా అతని కొనుగోలు చేయాలి అంటూ సీసీఐ నిబంధనలు విడుదల చేసిన కూడా ఆ నిబంధనలో మార్కెట్ యార్డ్ పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.

Leave a Comment